కారేపల్లి మండల పరిధిలోని సరస్వతీ విద్యాలయంలో 2004-–05 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వవిద్యార్థుల సమ్మేళం ఆదివారం ఘనంగా జరిగింది. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ నామా రామారావు మాట్లాడుతూ విద్యార్థుల చదువులో గురువులతో పాటు తల్లిదండ్రులది కీలకపాత్ర అన్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చేరుకొని తమ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అభినందనీయమన్నారు.
అనంతరం పూర్వవిద్యార్థులు తమ గురువులను సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శేషు, నారాయణ, రామ్మూర్తి, భాస్కర్, ఉపేందర్, రమేశ్, నిర్వహణ కమిటీ సభ్యులు మల్లికంటి కృష్ణమూర్తి, అహ్మద్ పాషా, నల్లమోతు వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు
- కారేపల్లి, వెలుగు