గట్టు భూత్కూర్‌‌‌లో ఆర్థిక సాయం అందజేత

గంగాధర, వెలుగు:  కాంగ్రెస్ నేత కొత్త జయపాల్ రెడ్డి మిత్రమండలి తరఫున గురువారం గట్టు భూత్కూర్ గ్రామ సర్పంచ్ కంకణాల విజేందర్ రెడ్డి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారు. బుధవారం ఆత్మహత్య చేసుకున్న బోళ్ల రమేశ్​ కుటుంబంతోపాటు అనారోగ్యంతో చనిపోయిన కాంపెల్లి వెంకయ్య(బర్ల వెంకటి)కుటుంబాన్ని పరామర్శించారు. రెండు కుటుంబాలకు రూ.5వేల చొప్పున సాయం అందజేశారు.