తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గౌడి బాలరాజు(38) అనే గీత కార్మికుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ రామవరం గ్రామానికి చెందిన గౌడి బాలరాజు కల్లు గీసేందుకు కారుకొండలోని తాటిచెట్టును శనివారం సాయంత్రం ఎక్కాడు. అదుపు తప్పి చెట్టు పైనుంచి పడ్డాడు. ఆయన అక్కడికక్కడే చనిపోయాడు. ఆయనకు భార్య, పిల్లలున్నారు. బాలరాజు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గీత కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.