స్వామివారికి  రూ.2.51 లక్షల విరాళం..గౌలీకార్ శ్యామ్ లాల్

యాదగిరిగుట్ట, వెలుగు : శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి యాదగిరిగుట్టకు చెందిన భక్తుడు, మాజీ వార్డు సభ్యుడు గౌలీకార్ శ్యామ్ లాల్ తన తండ్రి గౌలీకార్ నర్సోజీ జ్ఞాపకార్థం రూ.2.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. గురువారం ఫ్యామిలీ మెంబర్స్‌ గౌలీకార్ భానుప్రకాశ్, వేణుగోపాల్‌తో కలిసి ఆలయ ఏఈవో గజవెల్లి రఘు, అర్చకులు భాస్కరాచార్యులుకు నగదు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అష్టోత్తర శతఘటాభిషేకంలో ఉపయోగించే ఆరు వెండి కలశాల కోసం ఈ విరాళాన్ని ఇచ్చినట్లు గౌలీకార్ శ్యామ్ లాల్ తెలిపారు.  అనంతరం ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.