ఘనంగా గౌర పూర్ణిమ ఉత్సవం

ఘనంగా గౌర పూర్ణిమ ఉత్సవం

చైతన్య మహాప్రభు అవతరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం బంజారాహిల్స్ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్​లో గౌర పూర్ణిమ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు తయారు చేసిన 56 రకాల వంటకాలను స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అంతకు ముందు కలశ మహాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. హరేకృష్ణ కీర్తనల మధ్య మహాపల్లకీ ఉత్సవం వైభవంగా సాగింది.  – వెలుగు, జూబ్లీహిల్స్