
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ కొత్త పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ముందుగా ఆయన కరీంనగర్ కు వచ్చిన ఇప్పటి వరకు సీపీగా పనిచేసిన అభిషేక్ మహంతిను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనరేట్‌లోని నేరాలు, శాంతిభద్రతల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం కొత్త సీపీకి సాయుధ బలగాలు గౌరవ వందనం సమర్పించాయి. అనంతరం కమిషనరేట్‌లోని పోలీస్ ఆఫీసర్లు ఆయనకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమిషనరేట్ పరిధిలో నేరాల నియంత్రణ పై దృష్టి సారిస్తామన్నారు. శాంతిభద్రతలు కాపాడడం, రోడ్డు భద్రత, ఉల్లంఘనల నివారణ, పట్టణ పోలీసింగ్‌పై దృష్టి పెట్టడంతోపాటు పౌర-ఆధారిత పోలీసింగ్ సేవలు , ప్రజా భద్రతా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, రూరల్ ఏసీపీ శుభం ప్రకాశ్, ప్రొబేషనరీ ఐపీఎస్ వసుంధర యాదవ్, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు పాల్గొన్నారు.