అహ్మదాబాద్: తన చిన్న కొడుకు పెళ్లిలో సమాజానికి రూ.10 వేల కోట్లను అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ దానం చేశారు. ప్రజలకు అందుబాటు ధరల్లో బెస్ట్ హాస్పిటల్స్‌ను, మెడికల్ కాలేజిలను, కే–12 స్కూళ్లను, అడ్వాన్స్డ్ స్కిల్స్ అందించే అకాడమీలను అందివ్వడానికి ఈ ఫండ్స్ ఖర్చు చేయనున్నారు.
గుజరాత్‌కు చెందిన డైమండ్ వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా షా, గౌతమ్ అదానీ చిన్న కొడుకు జీత్ అదానీ పెళ్లి అహ్మదాబాద్‌లోని బెల్వెడెర్ క్లబ్‌లో శుక్రవారం చాలా సింపుల్‌గా, సాంప్రదాయబద్దంగా జరిగింది. కేవలం దగ్గర బంధువులు, స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న దివ్యాంగులైన మహిళలకు ఆర్థిక సాయం చేసేందుకు ‘మంగళ సేవ’ పేరుతో గౌతమ్ అదానీ ఓ ప్రోగ్రామ్‌ను పెళ్లికి ముందుకు ప్రారంభించారు.
ప్రతీ ఏడాది 500 మందికి సాయం చేయనుండగా, రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందివ్వనున్నారు. 21 మంది కొత్తగా పెళ్లైన దివ్యాంగులైన మహిళలు, వారి భర్తలను కలిసి ఈ ప్రోగ్రామ్‌ను జీత్ అదానీ ప్రారంభించారు. కాగా, జీత్ అదానీ ప్రస్తుతం అదానీ ఎయిర్‌పోర్ట్స్‌లో డైరెక్టర్‌గా, ఆరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు ఎండీగా పనిచేస్తున్నారు.