ఆసియాలో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ

ఆసియాలో అత్యంత ధనవంతుడు గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా  అదానీ గ్రూప్ బాస్ గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీ మరోసారి నిలిచారు.  అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకుపోతుండడంతో ఆయన సంపద  111 బిలియన్ డాలర్లకు పెరిగింది. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం, 109 బిలియన్ డాలర్లతో ఇప్పటి వరకు 11 వ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్న ముకేశ్ అంబానీని గౌతమ్ అదానీ  అధిగమించారు.  వచ్చే పదేళ్లలో 90 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేస్తామని అదానీ గ్రూప్ ప్రకటించడంతో పాటు  గ్రూప్ విస్తరణపై జెఫరీస్ రిపోర్ట్ ఇవ్వడంతో అదానీ షేర్లు శుక్రవారం 13 శాతం వరకు ర్యాలీ చేశాయి. 

అదానీ గ్రూప్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ.17.51 లక్షల కోట్లకు పెరిగింది. బ్లూమ్‌‌‌‌‌‌‌‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్‌‌‌‌‌‌‌‌లో 207 బిలియన్ డాలర్ల సంపదతో బెర్నార్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌ టాప్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. 203 బిలియన్ డాలర్లతో ఎలాన్ మస్క్ రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో, జెఫ్ బెజోస్‌‌‌‌‌‌‌‌ (199 బిలియన్ డాలర్లు) మూడో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో ఉన్నారు. టాప్ 10 లో ఇండియా నుంచి ఎవరూ చోటు దక్కించుకోలేదు.