అపర కుబేరుడు గౌతమ్ అదానీ ఒక్కో రంగంలోకి ఎంట్రీ ఇస్తూ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తు్న్నారు. తాజాగా వైద్య రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నట్లు ప్రకటించారు. వరల్డ్ క్లాస్ హెల్త్ సిటీని లాంచ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఎంత ఖర్చైనా తగ్గేదే లేదని, ప్రపంచస్థాయి వైద్యాన్ని ఇండియాలో అందిస్తామని ప్రకటించారు.
వరల్డ్ క్లాస్ మెడికల్ రీసెర్చ్ సంస్థ అయిన మయో క్లినిక్ తో పార్ట్నర్ షిప్ ద్వారా అహ్మదాబాద్, ముంబైలలో హెల్త్ సిటీలు స్టార్ట్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు. ముంబై, అహ్మదాబాద్ లో వెయ్యి పడకల(1000 బెడ్స్ ) హాస్పిటల్, మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది లాభాల కోసం చేసే పెట్టుబడి కాదని, సేవ చేయాలనే దృక్పథంతోనే ఏర్పాటు చేస్తున్నట్లు ట్వీట్ ద్వారా తెలిపారు.
Also Read :- ఎన్ని లక్షలు సంపాదిస్తే మధ్య తరగతి
‘‘అదానీ హెల్త్ సిటీని ప్రారంభించడం గర్వంగా భావిస్తున్నాం. వరల్డ్ క్లాస్ మెడికల్ రీసెర్చ్ సంస్థ అయిన మయో క్లినిక్ భాగస్వామ్యంతో మెడికల్ రీసెర్చ్, హెల్త్ కేర్, ఎడ్యుకేషన్ లక్ష్యంగా హెల్త్ సిటీ ప్రారంభిస్తున్నాం. ఆరోగ్య వంతమైన, దృఢమైన ఇండియాను నిర్మించడంలో ఇదే బిగినింగ్’’ అని ట్వీట్ చేశారు.
Proud to launch Adani Health City in partnership with Mayo Clinic, pioneering world-class medical research, affordable healthcare & education. Starting with two 1000-bed hospitals and medical colleges in Ahmedabad & Mumbai, we are on a mission to bring cutting-edge medical… pic.twitter.com/KQ6Xoql3FH
— Gautam Adani (@gautam_adani) February 10, 2025