SL vs IND 2024: శ్రీలంక టూర్‌కు సపోర్టింగ్ స్టాఫ్‌ను ప్రకటించిన గంభీర్

SL vs IND 2024: శ్రీలంక టూర్‌కు సపోర్టింగ్ స్టాఫ్‌ను ప్రకటించిన గంభీర్

టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్తున్న నేప‌థ్యంలో ఇవాళ ముంబైలో చీఫ్ కోచ్ గంభీర్‌, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ మీడియాతో మాట్లాడారు. ఈ మీటింగ్ లో పలు ఆసక్తికర విషయాలతో పాటు.. కోహ్లీ, రోహిత్ ల భవిష్యత్తు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇదే మీటింగ్ లో లంక పర్యటనకు తనతో పాటు వెళ్లబోయే తన సహాయక కోచ్ లను సైతం గంభీర్ సోమవారం (జూలై 22) ధృవీకరించారు.. ముందు నుంచి వస్తున్న ప్రచారం ప్రకారంగానే అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కట్ ను భారత జట్టులో అసిస్టెంట్ కోచ్‌లుగా ఉంటారని తెలిపారు. 

అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డెస్కట్ ఐపీఎల్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ అసిస్టెంట్ కోచ్ లు గా పని చేశారు. "నేను కేకేఆర్ తో ఐపీఎల్ లో పని చేశాను. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. టీమిండియా కోచ్ లుగా వారు విజయవంతమవుతారని ఆశిస్తున్నా". అని ముంబైలో జరిగిన విలేకరుల సమావేశంలో గంభీర్ చెప్పాడు. ప్రెస్ మీట్ అనంతరం గంభీర్ తో పాటు అభిషేక్, ర్యాన్ టెన్ శ్రీలంకకు బయలుదేరతారు.అయితే వీరి నియామకాలపై బీసీసీఐ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.

గంభీర్ స్వయంగా తన సపోర్టు స్టాఫ్‌లో నాయర్, డెస్కట్ లు ఉండాల్సిందిగా కోరితే దీనికి బీసీసీఐ అంగీకరించింది. ప్రస్తుత భారత ఫీల్డింగ్ టి దిలీప్ కూడా కోచింగ్ గ్రూప్‌లో భాగమవుతారని గంభీర్ అన్నారు. 2018 నుంచి అభిషేక్ నాయర్ కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తోన్నాడు. సికింద్రాబాద్‌లో జన్మించిన ఈ మాజీ బ్యాటర్ టీమిండియా తరఫున మూడు మ్యాచ్‌లను ఆడాడు. 2009 లో భారత్ తరపున అరంగేట్రం చేసిన ఈ ఆల్ ఆల్ రౌండర్ అదే సంవత్సరం చివరి వన్డే ఆడారు.  

Also Read:-23 బంతులాడి డకౌట్.. నమీబియా బ్యాటర్ చెత్త రికార్డ్

ర్యాన్ టెన్ డోస్చేట్ నెదర్లాండ్స్ మాజీ క్రికెటర్. 2006 నుండి 2021 వరకు అంతర్జాతీయ క్రికెట్ లో కొనసాగాడు. ఇతను దక్షిణాఫ్రికాలో జన్మించినప్పటికీ.. అతని తండ్రి నెదర్లాండ్స్ కు చెందినవాడు కావడంతో డచ్ తరపున అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు. 2011 లో భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్.. 2021 లో దుబాయ్ వేదికగా జరిగిన టీ20  వరల్డ్ కప్ లో ర్యాన్ టెన్ డోస్చేట్ నెదర్లాండ్స్ తరపున  ఆడాడు. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడిన ర్యాన్ టెన్ డోస్చాట్.. 29 మ్యాచ్ ల్లో 326 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో కేకేఆర్ ఫీల్డింగ్ కోచ్ గా ఉన్నాడు.