కోల్‌కతా నైట్‌‌ రైడర్స్‌‌ మెంటార్‌‌గా గంభీర్‌‌

కోల్‌‌కతా: టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్‌‌ గంభీర్‌‌ ఐపీఎల్‌లో మళ్లీ కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ గూటికి చేరాడు. గంభీర్​ను తమ మెంటార్‌‌గా తీసుకున్నట్లు ఫ్రాంచైజీ బుధవారం ప్రకటించింది. గత రెండేండ్లుగా లక్నో సూపర్‌‌జెయింట్స్‌‌కు మెంటార్‌‌గా వ్యవహరించిన గౌతీ 2023లో ఆ టీమ్‌‌ను ప్లే ఆఫ్స్‌‌ వరకు తీసుకెళ్లాడు. 

లక్నో ఆసీస్‌‌ మాజీ ఓపెనర్‌‌ జస్టిన్‌‌ లాంగర్‌‌ను హెడ్‌‌ కోచ్‌‌గా తీసుకురావడంతో గంభీర్‌‌ ఆ ఫ్రాంచైజీని వీడాడు. 2011 నుంచి 2017 వరకు నైట్‌‌రైడర్స్‌‌కు కెప్టెన్‌‌గా పని చేసిన గంభీర్‌‌ 2012, 2014లో టైటిల్స్‌‌ అందించాడు. ప్రస్తుతం కోచ్‌‌గా ఉన్న చంద్రకాంత్‌‌ పండిట్‌‌తో కలిసి గంభీర్‌‌ పని చేస్తాడని కేకేఆర్‌‌ తెలిపింది.