టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆస్ట్రేలియా నుంచి స్వదేశానికి బయలుదేరుతున్నాడు. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ మధ్యలో ఆస్ట్రేలియాను గంభీర్ విడిచిపెట్టబోతున్నట్లు సమాచారం. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. డిసెంబర్ 6 న జరగనున్న అడిలైడ్ టెస్ట్ సమయానికి గంభీర్ అందుబాటులో ఉండనున్నాడు. గంభీర్ లేకపోవడంతో అతని స్థానంలో అసిస్టెంట్ కోచ్ లు భారత జట్టును చూసుకుంటారు.
తొలి టెస్ట్.. రెండో టెస్టుకు మధ్య పది రోజుల సమయం ఉంది. ఈ గ్యాప్ లో భారత్ శనివారం (నవంబర్ 30) ఆస్ట్రేలియా కుర్రాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. పింక్ బాల్ టెస్టుకు ముందు ఈ మ్యాచ్ భారత్ కు ప్రాక్టీస్ గా ఉపయోగపడుతుంది. ఈ మ్యాచ్ కు గంభీర్ అందుబాటులో ఉండడం లేదు.రెండు రోజుల పింక్-బాల్ టూర్ గేమ్ కోసం భారత జట్టు బుధవారం (నవంబర్ 27) కాన్‌బెర్రాకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.
Also Read:-RCB ఫ్యాన్స్‌కు పండగ లాంటి వార్త.. 15 బంతుల్లో లివింగ్ స్టోన్ హాఫ్ సెంచరీ
పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్ 295 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ టెస్టులో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు భారత్ కు కలిసి వచ్చాయి. హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ పై నమ్మక ముంచి తీసుకుంటే వారు బాగా రాణించారు. ఇటీవలే భారత్ స్వదేశంలో న్యూజిలాండ్ జరిగిన మూడు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 0-3 తేడాతో ఓడిపోయిన తర్వాత గంభీర్ తీవ్ర ఒత్తిడిలో కనిపించాడు.
India coach Gautam Gambhir heads home for ‘personal reasons,’ and will rejoin the team before the pink-ball Test in Adelaide. Assistant coaches will take charge until then#AUSvIND pic.twitter.com/Wqn3lhKggM
— ESPNcricinfo (@ESPNcricinfo) November 26, 2024