టీమిండియా తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల(జూన్) చివరి వారంలో బీసీసీఐ పెద్దలు.. గంభీర్ పేరును అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. గౌతమ్ గంభీర్ మాత్రమే కోచ్ పదవికి దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. దీంతో గంభీర్ భారత జట్టు హెడ్ కోచ్ గా రావడం ఖాయమైంది. మంగళవారం (జూన్ 18) మధ్యాహ్నం క్రికెట్ అడ్వైజరీ కమిటీ ఇంటర్వ్యూ చేయనుంది. జూమ్ కాల్ ద్వారా గంభీర్‌తో కమిటీ మాట్లాడనుంది.
ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం టీ20 ప్రపంచకప్ 2024తో ముగియనుంది. తదుపరి జట్టుతో కొనసాగేందుకు ద్రవిడ్ సుముఖంగా లేకపోవడంతో.. కొత్త కోచ్ కోసం బీసీసీఐ గడిచిన నెలలో దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ పదవి కోసం రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్, మహేళ జయవర్దనే, జస్టిన్ లాంగర్ లాంటి పరువురు పేర్లు పరిశీలనలోకి వచ్చినప్పటికీ.. బీసీసీఐ గంభీర్‌వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టిన నాటి నుంచి గంభీర్ పేరు బాగా వినిపిస్తోంది. అతను భారత జట్టును విజయపథంలో నడిపించగలరని మాజీలు చెప్పుకొచ్చారు. మరోవైపు ఏ చిన్న తప్పును ఉపేక్షించని గంభీర్ చేతుల్లోకి భారత జట్టు అంటే, ఆటగాళ్లు సహా అభిమానులూ భయపడిపోతున్నారు. విఫలమైతే ఆటగాళ్లపై ఎలాంటి చర్యలుంటాయా తెలిపేలా నెట్టింట మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.
Here are some major Updates on Team India's New Head coach #T20WC2024 #AFGvsIND #RinkuSingh #TeamIndia #Cricket pic.twitter.com/fE8v0nGoxA
— SportsTiger (@The_SportsTiger) June 18, 2024