IND vs SL 1st ODI: గెలవాల్సిన మ్యాచ్ టై.. టీమిండియాను ముంచిన గంభీర్ ప్రయోగం

ఓ మాదిరి లక్ష్యం.. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు.. పవర్ ప్లే లో మెరుపు ఆరంభం.. మరో 156 పరుగులు చేస్తే విజయం.. చేతిలో 10 వికెట్లు ఉన్నాయి.. ఈ దశలో శ్రీలంకపై జరుగుతున్న తొలి వన్డేలో భారత విజయంపై ఎవరికీ పెద్దగా సందేహాలు లేవు. బ్యాటింగ్ డెప్త్ కూడా ఎక్కువగా ఉండడంతో మ్యాచ్ గెలవడం ఖాయం అనుకున్నారు. కానీ కట్ చేస్తే సీన్ మారింది. గెలవాల్సిన మ్యాచ్ ను ఓటమి అంచుల వరకు తెచ్చుకొని చివరికి టై గా ముగించారు. ఈ మ్యాచ్ ను జీర్ణించుకోవడం సగటు భారత అభిమానులకు కొంచెం కష్టమే.

కొలంబో వేదికగా జరిగిన శుక్రవారం (ఆగస్ట్ 2) శ్రీలంకతో జరిగిన తొలి వన్డే టై గా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక లోయర్ ఆర్డర్ బ్యాటర్ వెల్లలాగే తో పాటు సూపర్ ఫామ్ లో ఉన్న నిస్సంక హాఫ్ సెంచరీలు చేయడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో భారత్ కు మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్ రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడడంతో భారత్ స్కోర్ శరవేగంగా దూసుకెళ్లింది. 

ఈ దశలో భారత్ వరుస విరామాల్లో గిల్, రోహిత్ రెండు వికెట్లను కోల్పోయింది. సరిగ్గా ఇక్కడే భారత్ పొరపాటు చేసింది. నాలుగో స్థానంలో రెగ్యులర్ గా ఆడే శ్రేయాస్ అయ్యర్ ను బ్యాటింగ్ కు పంపకుండా వాషింగ్ టన్ సుందర్ ను బ్యాటింగ్ చేయడానికి వచ్చాడు. గంభీర్ చేసిన ఈ ప్రయోగం ఫలించలేదు. 5 పరుగులు చేసి సుందర్ ఔటయ్యాడు. అయితే ఇక్కడే మరో పొరపాటు జరిగింది. స్పిన్ సమర్ధవంతంగా ఎదుర్కొనే దూబేను 8 వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించడం కూడా భారత్ కు మైనస్ గా మారింది. 

చివరి 18 బాల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో టీమిండియా విజయానికి 5 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవసరం కాగా, లంక బౌలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చరిత్ అసలంక (3/30) చివరి రెండు వికెట్లు తీసి తమ జట్టుకు ఓటమి తప్పించాడు. మూడు మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌‌లో  టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెగ్గిన లంక  తొలుత 50 ఓవర్లలో 230/8 స్కోరు చేసింది. దునిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెల్లలాగే (67 నాటౌట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌), పాథుమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నిశాంక (56) హాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంచరీలు సాధించారు. తర్వాత బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దిగిన ఇండియా 47.5 ఓవర్లలో 230 రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రోహిత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శర్మ (58), అక్షర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పటేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (33), కేఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (31), శివందూబే (25), కోహ్లీ (24), శ్రేయస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (23) పోరాడినా భారత్ కు విజయం దక్కలేదు.