భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం లేదు. ఓ వైపు టీమిండియాలో, మరో వైపు ఐపీఎల్ లో తనదైన ముద్ర వేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత కూడా గంభీర్ తరచూ వార్తల్లో నిలుస్తూ వస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ .. ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ఉంటాడు. తన నిర్ణయాన్ని నిర్మొహమాటంగా చెప్పేస్తూ కొన్నిసార్లు వివాదాల్లో నిలుస్తాడు. తాజాగా ఐపీఎల్ లో తనకు నిద్ర లేని బ్యాటర్ ఎవరో చెప్పేశాడు.
గంభీర్ మాట్లాడుతూ..ఐపీఎల్‌లో నేను భయపడే ఏకైక బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ కాదని చెప్పాడు. ఐపీఎల్‌లో నేను భయపడే ఏకైక బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ అని అతడి వలన ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని అన్నాడు. రోహిత్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడూ.. నేను ప్లాన్ A, ప్లాన్ Bతో పాటు ప్లాన్ C కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే రోహిత్ ఉంటే నియంత్రించడం చాలా కష్టమని నాకు తెలుసు. అని స్టార్ స్పోర్ట్స్‌తో గంభీర్ అన్నాడు.
పరిస్థితులు ఎలా ఉన్నా.. ఒకే ఓవర్ లో రోహిత్ 30 పరుగులు కొట్టేస్తాడు. ప్రపంచంలో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ అని గంభీర్ ప్రస్తుత ఇండియన్ కెప్టెన్ పై ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్ లో కోల్ కత్తా జట్టును నడిపించిన గంభీర్ 2012, 2014లో టైటిల్స్ అందించాడు. ఓ వైపు బ్యాటర్ గా మరోవైపు కెప్టెన్ గా కేకేఆర్ జట్టుకు ఎన్నో సేవలను అందించాడు. 2024 ఐపీఎల్ కు కేకేఆర్ జట్టుకు మెంటార్ గా వ్యవహరించనున్నాడు. భారత జట్టు తరపున రెండు టీ20 వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ లో గంభీర్ టాప్ స్కోరర్ కావడం విశేషం.
Gautam Gambhir said, "Rohit Sharma is the most dangerous batsman and can even hit 30 runs in an over at any time." pic.twitter.com/TcuAMEii9m
— Vishal. (@SPORTYVISHAL) February 17, 2024