పదేళ్ల తర్వాత ఐపీఎల్ టైటిల్ గెలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్.. ప్రస్తుతం విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఫైనల్లో సన్ రైజర్స్ పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడో ఐపీఎల్ ట్రోఫీని తమ ఖాతాలో వేసుకున్నారు. కేకేఆర్ ట్రోఫీ గెలవడంలో ఆల్ రౌండర్ సునీల్ నరైన్, మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించారు. ఒకరు మైదానంలో అదరగొడితే.. మరొకరు బయట తమ జట్టుకు కీలక సలహాలు ఇస్తూ టైటిల్ అందించారు. గంభీర్, నరైన్ మధ్య ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకం.
2012లో కేకేఆర్ జట్టులోకి అడుగుపెట్టాడు సునీల్ నరైన్. 12 ఏళ్లలో కేకేఆర్ జట్టు తరపునే ఆడటం విశేషం. అతని ప్రారంభ సీజన్ లో గంభీర్ కేకేఆర్ సారధిగా వ్యవహరించాడు. ఈ సీజన్ లో తనకు నరైన్ కు మధ్య జరిగిన ఒక సంఘటన గురించి గంభీర్ చెప్పుకొచ్చాడు. "సునీల్ నరైన్ తన ఎమోషన్స్ ను బహిరంగంగా వ్యక్తపరచడు. నరైన్ మొదటిసారి జట్టులోకి చేరినప్పుడు అతన్ని లంచ్ కు పిలిచాను. అతను చాలా సిగ్గుపడేవాడు. లంచ్ మొత్తంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అయితే ఐపీఎల్ కు నా గర్ల్ ఫ్రెండ్ ను తీసుకురావచ్చా అని అడిగే సరికీ షాక్ అయ్యాను". అని గంభీర్ అన్నాడు.
Also Read:ఆర్సీబీ జట్టుపై సెటైర్లు.. రాయుడు కుటుంబానికి చంపేస్తామని బెదిరింపులు
2012, 2014లో గంభీర్ కెప్టెన్సీలో కేకేఆర్ టైటిల్ గెలుచుకుంది. ఇటీవలే జరిగిన సీజన్ లోనూ మెంటార్ గా జట్టుకు టైటిల్ అందించాడు. ఇదే ఊపులో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ గా రానున్నడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బ్యాటింగ్, బౌలింగ్ తో దుమ్ములేపిన నరైన్ రెండు అవార్డులు గెలుచుకున్నాడు. ఫాంటసీ ప్లేయర్ ఆఫ్ ది సీజన్(రూ. 10 లక్షలు)తో పాటు.. మోస్ట్ వ్యాల్యూబుల్ ప్లేయర్ (రూ. 10 లక్షలు) అవార్డులు సొంతం చేసుకున్నాడు. మొత్తం 14 మ్యాచ్ ల్లో 488 పరుగులు చేసిన నరైన్.. బౌలింగ్ లో 17 వికెట్లు పడగొట్టాడు.
Gautam Gambhir on Sunil Narine : First thing he asked me was that can I bring my girlfriend here in 2012 and he was so shy in the beginning 😂💜 pic.twitter.com/seCmdbxUa1
— Aditya ❄️ (@Hurricanrana_27) May 29, 2024