గౌతమ్ గంభీర్.. ఈ మాజీ ఓపెనర్ దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముక్కు సూటితో మాట్లాడటం తన నైజం. ఈ తరహా ప్రవర్తనతోనే అతను అనేక వివాదాలను కొని తెచ్చుకుంటుటారు. మరోవైపు విరాట్ కోహ్లీకి భారీ ఫాలోయింగ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అరుదులో అరుదుగా విరాట్ మీద విమర్శలు గుప్పించేవారు కూడా ఉంటారు. వారిలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ ముందు వరుసలో ఉంటాడు.
వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయం పక్కన పెడితే మైదానంలో చాలా సార్లు తమ దూకుడుతూ ఒకరిపై మరొకరు నోరు పారేసుకున్నారు. అప్పటినుంచి గంభీర్ ఏదో ఒకరకంగా కోహ్లీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. ఐపీఎల్ లో భాగంగా నేడు (మార్చి 29) కోల్ కతా నైట్ రైడర్స్ , రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఆతిధ్యమిస్తున్న ఈ మ్యాచ్ లో అందరి దృష్టి కోహ్లీ, గంభీర్ పైనే ఉంది.
తాజాగా గంభీర్ ఈ సారి కోహ్లీని పరోక్షంగా టార్గెట్ చేస్తూ ఆర్సీబీ జట్టుపై సంచలన కామెంట్స్ చేశాడు. "నేను ప్రతిసారి ఆర్సీబీ జట్టును ఓడిపోవాలని కోరుకుంటాను. నా కలల్లో కూడా ఆర్సీబీ జట్టు గెలవకూడదు. గేల్, డివిలియర్స్, కోహ్లీ లాంటి ఆటగాళ్లు ఉన్నా.. ఆ జట్టు ఇప్పటివరకు టైటిల్ గెలవలేదు. కానీ ఇప్పటికీ వారు అన్ని గెలిచారనుకుంటారు". అని గంభీర్ అధికారిక బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్‌తో అన్నారు.
2023 సీజన్ లో లక్నో, బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ, గంభీర్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మ్యాచ్ అయిపోయాక ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్ ఇచ్చే సమయంలోనూ కోహ్లీ, నవీన్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వాత కైల్ మేయర్స్, విరాట్ ఏదో మాట్లాడుతుండగా.. గంభీర్ వచ్చి మేయర్స్‌ను పక్కకు తీసుకెళ్లాడు.ఈ సమయంలో గంభీర్ మళ్లీ ఏదో అనడంతో కోహ్లి, గంభీర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. 2013 ఐపీఎల్ లో కోహ్లీ, గంభీర్ మధ్య చిన్నస్వామి స్టేడియంలో గొడవ జరిగింది.
Gautam Gambhir talking about facing RCB. pic.twitter.com/JO0QAbz8TI
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 29, 2024