Gautam Gambhir: మగ్గురు పాక్ ఆటగాళ్లకు చోటు.. ఆల్‌టైం ప్రత్యర్థి జట్టును ప్రకటించిన గంభీర్

Gautam Gambhir: మగ్గురు పాక్ ఆటగాళ్లకు చోటు.. ఆల్‌టైం ప్రత్యర్థి జట్టును ప్రకటించిన గంభీర్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తాను ఆడిన ఆటగాళ్లతో ఆల్-టైమ్ ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ప్రత్యర్థి ఆటగాళ్లతో కూడిన ఈ జట్టులో ఆసీస్ దిగ్గజాలు రికీ పాంటింగ్, గ్లెన్ మెక్‌గ్రాత్ కు గంభీర్ తన జట్టులో చోటు ఇవ్వలేదు. ఈ భారత మాజీ ఓపెనర్ తన జట్టుకు పేరు పెట్టకపోగా.. కెప్టెన్ గా ఎవరిని ప్రకటించలేదు. గంభీర్ ఎంచుకున్న జట్టులో ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్-ఉల్-హక్‌ల రూపంలో ముగ్గురు కెప్టెన్ లు ఉన్నారు. ఆస్ట్రేలియ, పాకిస్థాన్ నుంచి ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకున్నాడు. 

ఓపెనర్లుగా ఆసీస్ అత్యుత్తమ జోడీ డమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్‌లను ఎంచుకున్నాడు. డివిలియర్స్, లారా, ఇంజమామ్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో చోటు దక్కింది. ఆల్ రౌండలుగా ఆండ్రూ సైమండ్స్, రజాక్, ఫ్లింటాఫ్ లను ఎంచుకున్నాడు. వీరిలో పాక్ ఆల్ రౌండర్ రజాక్ ను జట్టులో చేర్చడం ఆశ్చర్యంగా అనిపించింది.  పేస్ బౌలర్లుగా షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్ లను సెలక్ట్ చేశాడు. ఏకైక స్పిన్నర్ గా ముత్తయ్య మురళీధరన్ ను తీసుకున్నాడు. న్యూజిలాండ్, బంగ్లాదేశ్‌లకు చెందిన ఆటగాళ్లకు గంభీర్ వరల్డ్ ఎలెవన్‌లో చోటు దక్కలేదు. 

గంభీర్ వరల్డ్ ఎలెవన్:

ఆడమ్ గిల్‌క్రిస్ట్, మాథ్యూ హెడెన్, ఏబీ డివిలియర్స్, బ్రియాన్ లారా, ఇంజమామ్ ఉల్ హక్, ఆండ్రూ సైమండ్స్, అబ్దుల్ రజాక్, ఆండ్రూ ఫ్లింటాఫ్, ముత్తయ్య మురళీధరన్, షోయబ్ అక్తర్, మోర్నీ మోర్కెల్