Champions Trophy 2025: అంతా గంభీర్ ఇష్టమేనా: స్క్వాడ్ నుంచి తప్పించి జైశ్వాల్‌కు అన్యాయం

Champions Trophy 2025: అంతా గంభీర్ ఇష్టమేనా: స్క్వాడ్ నుంచి తప్పించి జైశ్వాల్‌కు అన్యాయం

టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ వచ్చేసింది. మంగళవారం (ఫిబ్రవరి 11) బీసీసీఐ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది ఆటగాళ్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. న్నుగాయం కారణంగా పేసర్​ జస్​ప్రీత్​ బుమ్రా టోర్నీకి దూరమయ్యాడు. మంగళవారం వరకు ఎన్​సీఏలో రిహాబిలిటేషన్​లో ఉన్న బుమ్రా పూర్తి ఫిట్​నెస్​ సాధించలేకపోయాడు. బుమ్రా ప్లేస్​లో సెలెక్షన్ కమిటీ హర్షిత్ రాణాను ఎంపిక చేసింది. అలాగే, ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను చాంపియన్స్ ట్రోఫీ జట్టు నుంచి తప్పించి స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని తీసుకుంది. ఈ రెండు మార్పులు టీమిండియా ఫ్యాన్స్ కు అసలు నచ్చడం లేదు. 

గంభీర్ పై ఫ్యాన్స్ ఫైర్:

వరుణ్ చక్రవర్తి,హర్షిత్ రాణా లను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయడంపై టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బుమ్రా దూరమైతే అతని స్థానంలో అనుభవజ్ఞుడు మహమ్మద్ సిరాజ్ కు జట్టులో స్థానం దక్కాలి. కానీ హర్షిత్ రాణాకు చోటు కల్పించారు. సిరాజ్ ను కాదని రెండు వన్డేలు ఆడిన హర్షిత్ రాణాను ఎలా ఎంపిక చేస్తారంటూ నెటిజన్స్ మండిపడుతున్నారు. ఇక స్క్వాడ్ లో జైశ్వాల్ ను తప్పించడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. 

జైశ్వాల్ ను అసలు ఎందుకు ఎంపిక చేశారో ఎందుకు తప్పించారో ఎవరికీ అర్ధం కావట్లేదు. ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో విఫలమయ్యాడు. దీంతో ఈ యువ ఓపెనర్ పై వేటు పడింది. జైశ్వాల్ ను తప్పిస్తే అతని స్థానంలో మరొక బ్యాటర్ ను సెలక్ట్ చేయాలి. అయితే వరుణ్ చక్రవర్తిని స్క్వాడ్ లో చేర్చారు. అసలు విషయం ఏంటంటే హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి ఇద్దరూ కూడా ఐపీఎల్ లో గంభీర్ మెంటార్ ఉన్న కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కావడం విశేషం. దీంతో తమ ప్లేయర్లకు కావాలనే అవకాశం ఇస్తున్నాడని సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.

ALSO READ : IND vs ENG: ఇంగ్లాండ్‌తో చివరి వన్డే.. సుందర్, అర్షదీప్‌కు ఛాన్స్.. ఆ ఇద్దరికి రెస్ట్

గంభీర్ తీసుకున్న నిర్ణయాలు సఫలమైతే ఒకే. కానీ అతడి నిర్ణయాలు బెడిసి కొడితే మాత్రం బీసీసీఐ అతన్ని సాగనంపే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే యశస్వి, మహ్మద్ సిరాజ్‌, శివం దూబేను  నాన్‌ ట్రావెలింగ్ సబ్‌స్టిట్యూట్‌ ప్లేయర్లుగా ప్రకటించింది. జట్టుకు అవసరమైతే ఈ ముగ్గురూ దుబాయ్‌ వెళ్తారని సైకియా తెలిపారు.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రవి, వర్షంద్ర, షమీద్ రానా, వర్షంద్ర, షమీ చక్రవర్తి.