క్రికెటర్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

క్రికెటర్ అయినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. గంభీర్ షాకింగ్ కామెంట్స్

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో యాక్టీవ్ ఉండే ఈ మాజీ ఓపెనర్ ఎప్పుడూ  సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. తాజాగా అందరికి షాకిస్తూ తన జీవితంలో చేసిన అతి  పెద్ద తప్పు గురించి చెప్పుకొచ్చాడు.  ది బడా భారత్ టాక్ షో సీజన్ 2లో ర్యాపిడ్ ఫైర్ సెగ్మెంట్‌లో ఇంటర్వ్యూలో భాగంగా మీ జీవితంలో అతిపెద్ద పశ్చాత్తాపం ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. క్రికెటర్‌ అయినందుకు చింతిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. క్రికెట్ లో ఎన్నో ఘనతలు సాధించిన ఇలాంటి సమాధానం చెబుతాడని ఎవరూ ఊహించి ఉండరు. 

క్రికెటర్ గా ఎన్నో ఘనతలు

భారత క్రికెట్ లో 13 ఏళ్ళ పాటు తన ప్రయాణాన్ని కొనసాగించిన గంభీర్ ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ లు ఆడాడు. వీటిలో ముఖ్యంగా 2007 టీ 20 ప్రపంచ కప్ ఫైనల్లో ఆడిన 75 పరుగులు, 2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో చేసిన 97 పరుగులు ఎప్పటికీ మరువలేనివి. గంభీర్ ఆడిన ఈ రెండు ఇన్నింగ్స్ ల కారణంగానే టీమిండియా ప్రపంచ కప్ లు నెగ్గింది అంటే అతిశయోక్తి లేదు. వీటితో పాటు టెస్టుల్లో వరసగా 5 సెంచరీలతో నెంబర్ వన్ స్థానానికి కూడా చేరుకున్నాడు. ఇక కెప్టెన్ గా కూడా గౌతీకి మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కెప్టెన్సీ చేసిన ఆరు మ్యాచుల్లో భారత్ విజయం సాధించగా.. ఐపీఎల్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ టీంని రెండుసార్లు విజేతగా నిలిపాడు.

ALSO READ: ఆసియా కప్ 2023: పరువు పోగొట్టుకున్న పాకిస్థాన్..సొంత స్టేడియంలో వింత పరిస్థితి
 
వారిద్దరితో కుదరని సఖ్యత 

41 ఏళ్ళ గంభీర్ బ్యాటర్ గా తన ప్రయాణానికి విజయవంతంగా ముగించినా టీమిండియా మాజీ సారధులు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీతో మనస్పర్థలు ఉన్నాయనే ప్రచారం ఉంది. వరల్డ్ కప్ ఫైనల్లో తాను ఆడిన ఇన్నింగ్స్ కి విలువ ఇవ్వలేదని ధోనీకి ఆ క్రెడిట్ దక్కింద గంభీర్ చాలా సార్లు పరోక్షంగా చెప్పుకొచ్చాడు. మరోవైపు కోహ్లీతో ఇప్పటికీ మనస్పర్థలు ఉన్నాయనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.