SL vs IND 2024: కోచ్‌గా తొలి సిరీస్.. గంభీర్ రిక్వెస్ట్‌ను గౌరవించిన కోహ్లీ

SL vs IND 2024: కోచ్‌గా తొలి సిరీస్.. గంభీర్ రిక్వెస్ట్‌ను గౌరవించిన కోహ్లీ

శ్రీలంకతో జరగబోయే సిరీస్ వన్డే సిరీస్ కు స్టార్ ప్లేయర్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జట్టులో చేరారు. ఈ సిరీస్ కు ముందు ఈ ద్వయం రెస్ట్ తీసుకుంటారనే ప్రచారం జరిగింది. కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటు పేసర్ జస్ప్రీత్ బుమ్రా లంక సిరీస్ కు దూరంగా ఉండడం దాదాపుగా ఖాయమైంది. వచ్చిన సమాచారం ప్రకారం రాహుల్ సారధ్యంలోని భారత క్రికెట్ జట్టును శ్రీలంకకు పంపేందుకు సెలక్టర్లు సిద్ధమయ్యారు. అయితే గంభీర్ ఎంట్రీతో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. 

టీ20 వరల్డ్ కప్ 2024 ముగిసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవికి రాహుల్ ద్రావిడ్ గుడ్ బై చెప్పాడు. ఈ సమయంలో అతని స్థానంలో గంభీర్ ను భారత హెడ్ కోచ్ గా నియమించారు. శ్రీలంక టూర్ తో గంభీర్ హెడ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. హెడ్ కోచ్ గా గంభీర్ లకు ఇదే తొలి సిరీస్ కావడంతో లంక సిరీస్ కు కోహ్లీ ఖచ్చితంగా ఉండాలని భావించాడట.

ఇదే విషయాన్ని కోహ్లీకి చెప్పి రిక్వెస్ట్ చేసినట్టు సమాచారం. గంభీర్ మాటను గౌరవించి కోహ్లీ బీసీసీఐతో మాట్లాడి లంక సిరీస్ కు అందుబాటులో ఉంటానని చెప్పాడట. రోహిత్ సైతం గంభీర్ మాట ప్రకారం శ్రీలంక సిరీస్ ఆడతానని చెప్పాడట. కోహ్లీ,రోహిత్ ఇప్పటికే అంతర్జాతీయ టీ20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

శ్రీలంకతో జరగనున్న మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌‌‌‌‌‌‌‌లకు ఇండియా టీమ్‌‌‌‌‌‌‌‌ను గురువారం (జూలై 18) ప్రకటించారు. బిగ్‌‌‌‌‌‌‌‌ హిట్టర్‌‌‌‌‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌‌‌‌‌ యాదవ్‌‌‌‌‌‌‌‌ను టీ20లకు కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు. వన్డేలకు రోహిత్‌‌‌‌‌‌‌‌ శర్మ సారథ్యం వహించనున్నాడు. రెండు ఫార్మాట్లకు శుభ్‌‌‌‌‌‌‌‌మన్‌‌‌‌‌‌‌‌ గిల్‌‌‌‌‌‌‌‌ను వైస్‌‌‌‌‌‌‌‌ కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా నియమించారు.