భారత క్రికెట్ లో ధోనీ సాధించిన సంచలనాలు చాలానే ఉన్నాయి. కెప్టెన్ గా, బ్యాటర్ గా లెక్కకు మించిన ఎన్నో రికార్డులు నెలకొల్పిన మాహీ.. భారత క్రికెట్ లో చెరగని ముద్ర వేసాడు. అయితే మహేంద్రుడికి వ్యక్తిగతంగా కంటే కెప్టెన్ గానే ఎక్కువ రికార్డులు ఉన్నాయి. దీనికి కారణం కూడా లేకపోలేదు. జట్టు అవసరాల కోసం తన బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకోవడంతో పాటు జట్టుకి విజయాన్ని అందించాలనే లక్ష్యంతో తన బ్యాటింగ్ లోని వేగాన్ని తగ్గించేసాడు.
జట్టుని ముందుండి నడిపిస్తూ తెర వెనుక ధోనీ చేసిన త్యాగాలు ఎవరికీ తెలియవు. అయితే ధోనీ తన కెరీర్ లో చేసిన అతి పెద్ద త్యాగం గురించి మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చెప్పేసాడు. ఎప్పుడూ ఏదో ఒక షాకింగ్ కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచే గౌతీ తాజాగా మరో ఆసక్తికర వార్తను మన ముందుకు తీసుకొచ్చాడు.
Also Read :- డ్రగ్స్ కేసులో ఆస్ట్రేలియా క్రికెటర్ పేరు.. దోషిగా తేలితే జీవిత ఖైదు!
ఈ సందర్భంగా గంభీర్ మాట్లాడుతూ.. "ధోని నెంబర్ 3 లో బ్యాటింగ్ కి వస్తే చాలా వైట్ బాల్ రికార్డులు బద్దలు కొట్టేవాడు. కెప్టెన్ బాధ్యతల కారణంగా అతని బ్యాటింగ్ లో కాస్త దూకుడు తగ్గింది. అతను జట్టు ట్రోఫీల కోసం తన అంతర్జాతీయ పరుగులను త్యాగం చేశాడు".ఇదిలా ఉండగా ధోనీ కెరీర్ ఆరంభంలో నెంబర్ 3 లో బ్యాటింగ్ కి వచ్చి భారీ సెంచరీలు చేసిన సంగతి తెలిసిందే. వీటిలో తన అత్యధిక వ్యక్తిగత స్కోర్ 183 పరుగులు,పాకిస్థాన్ పై సిరీస్ లో 148 పరుగులు ఉన్నాయి.