బుమ్రా ఒక్కడికే ఆ మినహాయింపు.. లంక సిరీస్‌కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు

బుమ్రా ఒక్కడికే ఆ మినహాయింపు.. లంక సిరీస్‌కు ముందు గంభీర్ కీలక వ్యాఖ్యలు

శ్రీలంక సిరీస్ కు అందుబాటులో ఉన్న బలమైన టీమ్ ను సెలక్ట్ చేశారు. రెస్ట్  తీసుకుందామనుకున్న కోహ్లీ, రోహిత్ జట్టులోకి వచ్చేశా రు. అయితే స్టార్ పేసర్ బుమ్రాకు ఎందుకు రెస్ట్ కలిపించారనే విషయంలో కొంత సందిగ్దత నెలకొంది. ఈ విషయంపై టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్లారిటీ  ఇచ్చాడు. టీమిండియా శ్రీలంక టూర్‌కు వెళ్తున్న నేప‌థ్యంలో సోమవారం (జూలై 22) ముంబైలో చీఫ్ కోచ్ గంభీర్‌, చీఫ్ సెలెక్ట‌ర్ అజిత్ అగార్క‌ర్ మీడియాతో మాట్లాడారు.  

శ్రీలంక సిరీస్ కు కోహ్లీ, రోహిత్ శర్మలను సెలక్ట్ చేసి బుమ్రాకు ఎందుకు రెస్ట్ ఇచ్చారనే ఎదురైంది. ఈ ప్రశ్నకు గంభీర్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి విరాట్ కోహ్లి , రోహిత్ శర్మలతో సహా మెజారిటీ భారత ఆటగాళ్లు సిరీస్‌ లు ఆడేందుకు అందుబాటులో ఉంటారని గంభీర్ స్పష్టం చేశాడు. అయితే ఈ రూల్ జస్ప్రీత్ బుమ్రాకు వర్తించదని తెలిపాడు. అతను మూడు ఫార్మాట్ లలో భారత్ కు ఆడటం కీలకమని.. అతను ఫిట్ గా ఉండటానికి పని భారం తగ్గించడానికి రెస్ట్ ఇస్తామని చెప్పుకొచ్చాడు. బుమ్రా అరుదైన బౌలర్ అని అతన్ని తాజాగా ఉంచాల్సిన అవసరం మాపై ఉందని గంభీర్ అన్నాడు. 

Also Read:-పారిస్ ఒలింపిక్స్ చివరిది.. టెన్నిస్‌కు స్టార్ ప్లేయర్ రిటైర్మెంట్

రానున్న ఆరు నెలల్లో టీమిండియా బిజీ షెడ్యూల్ ఆడాల్సి ఉంది. ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో భాగంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తో కీలకమైన టెస్ట్ మ్యాచ్ లు ఆడాలి ఉంది. వీటితో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ కారణంగా బుమ్రాకు రెస్ట్ ఇచ్చారని తెలుస్తుంది. వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న బుమ్రా.. ఆ తర్వాత జరిగిన జింబాబ్వే సిరీస్ తో పాటు మరికొన్ని రోజుల్లో కానున్న శ్రీలంక సిరీస్ కు బీసీసీఐ అతనికి రెస్ట్ ఇచ్చారు.