భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. మళ్లీ ఎంపీగా పోటీ చేయటం అనే మాటే లేదని.. అసలు రాజకీయాలకే గుడ్ బై చెబుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. KKRకి మెంటర్ గా గంభీర్ తిరిగి బాధ్యతలు చేపడుతున్నాడు. ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్‌తో కలిసి పని చేయనున్నట్లు KKR ఫ్రాంచైజీ వెల్లడించింది. పాలిటిక్స్ కు గుడ్ బై చెప్పడంతో గంభీర్ తన దృష్టి మొత్తం రానున్న ఐపీఎల్ మీదే పెట్టినట్లు తెలుస్తుంది. తాజాగా స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడుతూ రానున్న ఐపీఎల్ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
ఐపీఎల్ అనేది సీరియస్ క్రికెట్. ఈ విషయం నేను ఎప్పటినుంచో చెప్పాను. ఈ లీగ్ అంటే బాలీవుడ్, గ్లామర్ కాదు. ఐపీఎల్ అంటే అత్యంత పోటీ ఉన్న క్రికెట్. అందుకనే ఐపీఎల్ ప్రపంచంలో కష్టమైన టీ20 లీగ్‌గా పేరొందింది. అని గంభీర్ వెల్లడించాడు. కోల్‌కతా నైట్ రైడర్స్‌కు మంచి క్రేజ్ ఉందని.. ఐపీఎల్ అరంభంలో కోల్‌కతా అద్భుత ప్రదర్శన చేసిందిన గంభీర్ గుర్తు చేశాడు. కోల్‌కతా జట్టు చిల్లర పనులతో వార్తల్లో నిలవదని, గ్రౌండ్ లో తమ ఆటతోనే అభిమానుల మనసు గెలుస్తుందని ఈ మాజీ భారత ఓపెనర్ చెప్పుకొచ్చాడు.
2011 నుంచి 2017 వరకు గౌతమ్ గంభీర్ కోల్ కతా జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. గంభీర్ సారథ్యంలో కేకేఆర్.. 2012, 2014లో ఐపీఎల్ టైటిల్స్ సాధించింది. 2022, 2023 సీజన్లలో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా గంభీర్ పనిచేశాడు.
Gautam Gambhir on IPL Cricket pic.twitter.com/xzblkC74o5
— RVCJ Media (@RVCJ_FB) March 3, 2024