భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్సీ మొదటి సవాలు అయితే, కోచ్ పదవి రెండో సవాలు. అలాంటి బాధ్యతకు భారత మాజీ ఓపెనర్ గంభీర్ ఎంపిక అవుతారో.. లేదో.. తెలియదు కానీ, ఈ మాజీ ఎంపీ అత్యుత్సాహం చూపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. భారత క్రికెట్ నియంత్రణా మండలి(బీసీసీఐ) ముందు మాజీ ఓపెనర్ ఉంచుతున్న డిమాండ్లే.. అందుకు ప్రధాన కారణం.
రాజాకీయ నాయకుడు అనిపించారు..
కోచ్ బాధ్యతలు చేపట్టే ముందు గంభీర్.. రాజాకీయ నాయకుడిలా బీసీసీఐ ముందు కొన్ని డిమాండ్లు ఉంచినట్లు వార్తలు బయటకొస్తున్నాయి. తాను ప్రతిపాదించిన అన్ని షరతులకు బీసీసీఐ అంగీకరిస్తేనే.. కోచ్ బాధ్యతలు చేపడతానని గంభీర్ అన్నారని సమాచారం. ఒక్కసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టాక జట్టుకు సంబంధించిన విషయాల్లో బీసీసీఐ ఎట్టిపరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదన్నది ప్రధాన డిమాండ్‌గా తెలుస్తోంది. అసిస్టెంట్ కోచ్‌లను, సహాయక సిబ్బందిని తాను ఎంపిక చేస్తానని చెప్పడం మరొక డిమాండ్ గా చెప్తున్నారు.
సీనియర్లకు చివరి అవకాశం
పైరెండు కాకుండా, వచ్చే ఏడాది పాకిస్తాన్ గడ్డపై జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజా, షమీ వంటి సీనియర్లు నిరాశపరిస్తే జట్టు నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని గంభీర్ షరతు పెట్టినట్లు తెలుస్తోంది. అయితే, మూడు ఫార్మాట్ల నుండి వీరిని తొలగించే ప్రస్తావన తేలేదని సమాచారం. పై షరతులకు బీబీసీసీ అంగీకరించిందని.. రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన చేయనుందని నివేదికలు వస్తున్నాయి.
Gautam Gambhir's Conditions for Head Coach -
— Kandy G (@Kandy_G_) June 24, 2024
- Complete control, no interference
- Freedom to select his own staff
- ICC Champions Trophy 2025 is the final chance for senior players.
- Senior players like Virat Kohli and Rohit Sharma specifically mentioned in this condition. pic.twitter.com/BZkpNdnqeT