టీమిండియా మాజీ ఓపెనర్.. ప్రస్తుత భారత జట్టు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ తన ఆల్ టైం భారత ప్లేయింగ్ 11 జట్టును ప్రకటించాడు. ఈ జట్టుకు ధోనీని కెప్టెన్ గా ఎంపిక చేశాడు. వివారాల్లోకెళ్తే.. సెహ్వాగ్, తనను ఓపెనర్లుగా ఎంచుకున్నాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్, క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లను వరుసగా మూడు, నాలుగు స్థానాలకు ఎంపిక చేశారు. విరాట్ కోహ్లీ ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, మహేంద్ర సింగ్ ధోనీలు లోయర్ ఫినిషర్లుగా ఎంపిక చేశారు.
Also Read:-నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు
ఫాస్ట్ బౌలర్లుగా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్, దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ లను తన జట్టులో చేర్చాడు. రవి చంద్రన్ అశ్విన్, ఆల్ టైం బెస్ట్ స్పిన్నర్లలో ఒకడైన అనీల్ కుంబ్లేలను స్పిన్నర్లుగా సెలక్ట్ చేశాడు. గంభీర్ తన జట్టులో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్పీడ్ స్టార్ జస్ప్రీత్ బుమ్రాలకు స్థానం కల్పించలేదు. సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్ లకు సైతం తన జట్టులో చోటివ్వలేదు. స్పోర్ట్స్‌కీడా యూట్యూబ్ ఛానెల్‌లో గంభీర్ తన ఈ జట్టును ప్రకటించాడు.
గౌతమ్ గంభీర్ ఆల్-టైమ్ భారత జట్టు:
వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, MS ధోనీ (వికెట్ కీపర్), అనిల్ కుంబ్లే, రవిచంద్రన్ అశ్విన్, ఇర్ఫాన్ పఠాన్, జహీర్ ఖాన్.
How would you rate Gautam Gambhir's all-time XI for India? 🤔#GautamGambhir #India #BestXI #Sportskeeda pic.twitter.com/N4ejPlZOZr
— Sportskeeda (@Sportskeeda) September 1, 2024