
తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ దంపతులు దర్శించుకున్నారు. గంభీర్‌కు ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మాట్లాడారు. వచ్చే నెలలో ఫ్రారంభం కానున్న వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియా కచ్చింతంగా విజయం సాధిస్తుందని గంభీర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గంభీర్ తో పలువురు అభిమానులు సెల్ఫీలు తీసుకున్నారు.
మరోవైపు తిరుమలో భక్తుల రద్దీ సాధరణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ఇక బుధవారం తిరుమల శ్రీవారిని 55,747 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.11 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. శ్రీవారికి 21,774 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.