SL vs IND, 2nd ODI: గంభీర్ పిచ్చి ప్రయోగాలు.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టని టీమిండియా

SL vs IND, 2nd ODI: గంభీర్ పిచ్చి ప్రయోగాలు.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టని టీమిండియా

శ్రీలంక పర్యటనలో భాగంగా వన్దే సిరీస్ లో భారత జట్టు బోణీ కొట్టలేకపోతుంది. వరుసగా రెండు మ్యాచ్ ల్లోనూ విజయం దగ్గరకు వచ్చి మాయమైంది. తొలి వన్డేలో గెలవాల్సిన మ్యాచ్ ను టై చేసుకున్న రోహిత్ సేన.. రెండో టీ20లో అదిరిపోయే ఆరంభం లభించినా..  మిడిల్ ఆర్డర్ చెత్త బ్యాటింగ్ కారణంగా పరాజయం పాలైంది. ఈ విజయంతో శ్రీలంక 1-0 ఆధిక్యంలో నిలిచింది. చివరి మ్యాచ్ లో లంక గెలిస్తే సిరీస్ సొంతమవుతుంది. ఓడిపోతే సిరీస్ ను సమం చేసుకుంటుంది. మొత్తానికి శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్ ను భారత్ గెలవలేకపోయింది. 

ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం గురించి మాట్లాడుకుంటే.. చెత్త బ్యాటింగ్ అని చెప్పాలి. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ మరోసారి అద్భుతమైన ఆరంభం ఇచ్చినా మిడిల్ ఆర్డర్ వరుసగా రెండో మ్యాచ్ లోనూ దారుణంగా విఫలమయ్యారు. అయితే వరుసగా రెండో సారి భారత బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు జరగడం టీమిండియా పరాజయానికి కారణమైంది. తొలి మ్యాచ్ లో వాషింగ్ టన్ సుందర్ ను బ్యాటింగ్ ఆర్డర్ లోకి ముందుకు పంపి తగిన మూల్యం చెల్లించుకున్న భారత జట్టు.. రెండు వన్డేలో అక్షర్ పటేల్, దూబేలను వరుసగా 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ కు పంపి ఓటమి పాలయ్యారు.

నాలుగో స్థానంలో రెగ్యులర్ గా బ్యాటింగ్ చేసే శ్రేయాస్ అయ్యర్.. ఐదో స్థానంలో ఆడే కేఎల్ రాహుల్ లను బ్యాటింగ్ లో వెనక్కి పంపారు. రెండో వన్డేలో అయ్యర్ ఆరో స్థానంలో.. రాహుల్ ఏడో స్థానంలో బ్యాటింగ్ కు దిగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ మార్పులకు కారణం కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. డగౌట్ లో అతను తీసుకునే నిర్ణయాలు భారత్ కు ఏ మాత్రం కలిసి రావడం లేదు.నెటిజన్స్ సైతం గంభీర్ కోచింగ్ పై విమర్శలు చేస్తున్నారు. 

ఈ మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39) పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. 64 పరుగులతో రోహిత్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, తరువాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్‌లో అక్సర్ పటేల్(44) పర్వాలేదనిపించాడు.