సోలో లైఫ్ బెటర్‌‌‌‌‌‌‌‌ అంటూ..

‘బిగ్ బాస్’ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటిస్తున్న సినిమా ‘సోలో బాయ్’. శ్వేతా అవస్థి హీరోయిన్. పి నవీన్ కుమార్ దర్శకత్వంలో సతీష్ కుమార్ నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌మీట్‌‌‌‌లో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ ‘ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. ఇందులోని హుక్ స్టెప్ చాలెంజ్ చేసి మా టీమ్‌‌‌‌ను ట్యాగ్ చేసి పోస్ట్ చేసిన వాళ్లలో ముగ్గురిని ఎంపిక చేసి బహుమతులు అందజేయనున్నాం. 

జుడా శాందీ కంపోజ్ చేసిన ఈ పాటకు  కాసర్ల శ్యామ్ గారు క్యాచీ  లిరిక్స్‌‌‌‌ రాయగా, రాహుల్ సిప్లిగంజ్  అద్భుతంగా పాడారు. సందీప్ మాస్టర్ నాలో ఉన్న డ్యాన్సర్‌‌‌‌‌‌‌‌ను బయటికి తీసుకొచ్చారు’ అని చెప్పాడు. ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది అని ఆశిస్తున్నా అంది శ్వేతా.  టైటిల్‌‌‌‌ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వస్తోందని, గౌతమ్ కృష్ణ పెద్ద హీరో అవుతాడని దర్శక నిర్మాతలు చెప్పారు. నటి అనిత చౌదరి, కొరియోగ్రాఫర్ సందీప్ పాల్గొన్నారు.