న్యూఢిల్లీ: టెస్ట్‌ల్లో ఆడేటప్పుడు శుభ్‌మన్ గిల్ దూకుడు తగ్గించుకుంటే మంచిదని ఇండియా లెజెండ్ ప్లేయర్ సునీల్ గావస్కర్ సూచించాడు. షార్ట్ ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్‌లు చాలా భిన్నంగా ఉంటాయన్నాడు. ‘టెస్ట్ క్రికెట్‌లో గిల్ దూకుడుగా ఆడుతున్నాడు. అది మంచిది కాదు. ఎందుకంటే ఈ ఫార్మాట్ అవసరాలు చాలా భిన్నంగా ఉంటాయి. పరిస్థితిని బట్టి మారుతుంటాయి. వాటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లాలి.
టీ20, వన్డేలతో పోలిస్తే బాల్స్‌లోనూ చాలా డిఫరెన్స్ ఉంటుంది. రెడ్ బాల్‌కు గాలిలో స్వింగ్, బౌన్స్ ఎక్కువ. సాధారణంగా వైట్‌బాల్ బౌన్స్ తక్కువగా ఉంటుంది’ అని సన్నీ పేర్కొన్నాడు. వీలైనంత త్వరలో గిల్ టెస్ట్ ఫార్మాట్‌కు అలవాటు పడతాడని గావస్కర్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కెరీర్ ప్రారంభంలో ఎక్కువగా షార్ట్ ఫార్మాట్ మ్యాచ్‌లు ఆడటం వల్ల దూకుడు అలవాటైందన్నాడు. కొద్దిగా శ్రమిస్తే టెస్ట్ ఫార్మాట్‌లోనూ ఆకట్టుకుంటాడని చెప్పాడు.