ముంబై: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య గొడవలంటూ వస్తున్న రూమర్లపై లెజెండరీ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ స్పందించాడు. రోహిత్, కోహ్లీ మధ్య ఎలాంటి గొడవ లేదన్న ఆయన.. రూమర్లను కొట్టిపారేశారు. ఇదంతా ఒట్టి నాన్ సెన్స్ అన్నారు. వారిద్దరూ భారత్ కు ఆడుతున్నారననే విషయాన్ని గుర్తుంచుకోవాలని.. వారిద్దరికీ పడట్లేదని వస్తున్న వార్తలన్నీ పుకార్లేనని చెప్పారు. అసలు ఈ రూమర్లను రోహిత్, కోహ్లీలు పట్టించుకోరన్నాడు. గ్రౌండ్ లో ఒకరికి ఒకరు సహకరించుకుంటూ భారత జట్టును ముందుకు తీసుకెళ్తున్నారని వ్యాఖ్యానించాడు. నిజమేంటో అందరికీ తెలుసన్నాడు.
టీమిండియాకు ఆడే వారిలో బ్యాటర్లు పరుగులు చేయకపోతే.. వికెట్లు తీయడంలో బౌలర్లు విఫలమైతే జట్టులో స్థానం కోల్పోవడం ఖాయమని గవాస్కర్ స్పష్టం చేశాడు. దిగ్గజ ఆటగాడికైనా అది తప్పదని హెచ్చరించాడు. కోహ్లీ ఎవరి కెప్టెన్సీలో ఆడినా మెరుగ్గా రాణిస్తాడని పేర్కొన్నాడు. వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో.. విరాట్ సూచన మేరకు రోహిత్ డీఆర్ఎస్ ద్వారా వికెట్ సాధించాడు. ఈ ఘటనను ఉదహరించిన గవాస్కర్.. వారి మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పడానికి ఇదే నిదర్శనమని వివరించాడు.
మరిన్ని వార్తల కోసం: