కోరిక తీర్చుకోవాలనుకున్న ఓ గేGay) జంటకు వింత అనుభవం ఎదురైంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైన స్వలింగ సంపర్కుల జంట సన్నిహితంగా ఉండగా.. ఆ లైంగిక చర్యలను రహస్యంగా వీడియో తీసిన ఓ ముఠా.. వారి నుంచి అందినకాడికి దోచేసింది. అయినప్పటికీ, నిందితులు వారిని వదల్లేదు. మరింత మొత్తం కావాలంటూ వారిని వేధించడం మొదలు పెట్టారు. చివరకు ఏం చేయాలో తెలియని బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు.
యూపీ, ఘజియాబాద్ కు చెందిన ఓ గే.. గ్రిండర్(Grindr) డేటింగ్ యాప్ ద్వారా ఒకరితో కనెక్ట్ అయ్యాడు. ఇద్దరూ కలిసి ఓ ఫ్లాట్‌లో కలవడానికి అంగీకరించారు. ఒకరోజు ఇద్దరు ఫ్లాట్‌కు చేరుకొని లైంగిక చర్యల్లో ఉండగా.. ఓ ముఠా వారి కలయికను రహస్యంగా చిత్రీకరించారు. అనంతరం వారిని బెదిరించి 1.40 లక్షల రుపాయలను బదిలీ చేపించుకున్నారు. అక్కడితో నిందితులు ఆ జంటను వదల్లేదు. అడిగినంత ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పెడదామని హెచ్చరించారు. దాంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
ముగ్గురు అరెస్ట్..
ఫిర్యాదు అందుకున్న ఘజియాబాద్ పోలీసులు చాకచక్యంగా ముగ్గురు నిందితులు రింకు, అజయ్, శుభంలను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈ ముఠాకు ప్రధాన సూత్రధారి రింకూగా తేల్చారు. నిందితుల నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.10 వేల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
ALSO READ | మరదల్ని గ్యాంగ్ రేప్ చేయించేందుకు రూ.40 వేల లోన్ తీసుకున్నాడు.. చివరికి ఏమైందంటే..