గాజా ఆకలితో అల్లాడుతున్నది .. అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్

మనీలా: గాజాలోని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడికి యుద్ధప్రాతిపదికన ఆహారం పంపించాల్సిన అవసరం ఉందన్నారు. ఫిలిప్పీన్స్ పర్యటనలో ఉన్న బ్లింకెన్ మంగళవారం అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘గాజాలోని ప్రజలు ఆకలితో అల్లాడుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు. వెంటనే ఆహారం పంపించాల్సిన అవసరం ఉంది. పాలస్తీనాకు అందిస్తున్న మానవతా సాయాన్ని విదేశాలు మరింత పెంచాలి’ అని కోరారు. ‘నా మిడిల్ ఈస్ట్ పర్యటనలో సౌదీ అరేబియా, ఈజిప్ట్​తో చర్చలు జరుపుతాను. గాజాలో శాంతి కోసం ప్రయత్నాలు చేస్తాను’ అని పేర్కొన్నారు.