
మధుసూదనాచారిని గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ గా తెలంగాణ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇప్పటికే ఆయన నియామకాన్ని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. సర్క్యులేషన్ పద్ధతిన మంత్రివర్గం ఆమోదించింది. మంత్రుల సంతకాలతో రాష్ట్ర ప్రభుత్వం రాజ్‌భవన్‌కు దస్త్రం పంపింది. తొలుత పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రతిపాదించిన సర్కార్.. గవర్నర్ తిరస్కరణతో ఆ అవకాశం మధుసూదనాచారికి ఇచ్చారు. కౌశిక్ రెడ్డి పేరు స్థానంలో మధుసూదనాచారిని సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును గవర్నర్ తమిళిసై ఆమోదించారు.
సిరికొండ మధుసూదనాచారి భూపాలపల్లి నియోజకవర్గం నుంచి 2014లో టీఆర్ఎస్ తరఫున ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా సేవలందించారు. 2018 ఎన్నికల్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి బరిలో దిగి.. కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.