న్యూఢిల్లీ: జీబీ లాజిస్టిక్స్ కామర్స్ లిమిటెడ్ఐపీఓ ఈ నెల 24న మొదలవనుంది. ఈ రూ.25 కోట్ల విలువైన ఇష్యూ 28న ముగుస్తుంది. దీని ప్రైస్‌బ్యాండ్‌ను రూ.95–102 మధ్య నిర్ణయించారు. ఐపీఓ బీఎస్ఈ ఎస్ఎంఈ ప్లాట్‌ఫారమ్‌లో లిస్టవుతుంది.
ఇన్వెస్టర్లు కనీసం 1,200 షేర్లకు దరఖాస్తు చేసుకోవాలి. జీబీ లాజిస్టిక్స్ ఫ్రెష్ఇష్యూ ద్వారా 24.57 లక్షల ఈక్విటీ షేర్లను జారీ చేస్తుంది. ఐపీఓతో వచ్చిన ఆదాయాన్ని అప్పులు తీర్చడానికి, వర్కింగ్‌క్యాపిటల్, సాధారణ కార్పొరేట్అవసరాలకు వాడుతుంది. జీబీ లాజిస్టిక్స్కామర్స్ లిమిటెడ్ ఫుల్ట్రక్లోడ్ ట్రాన్స్‌పోర్టేషన్, స్పెషల్ హ్యాండ్లింగ్ వంటి సేవలను అందిస్తుంది.