
హైదరాబాద్, వెలుగు: సిరామిక్ టైల్ తయారీదారు జీసీ సెరా టైల్స్, హైదరాబాద్‌లోని ఆటో నగర్‌లో ప్రత్యేక షోరూమ్‌ను ప్రారంభించింది. నివాస, వాణిజ్య స్థలాలకు అవసరమైన ఎన్నో రకాల సిరామిక్ టైల్స్‌ను ఇది అందిస్తుంది. కచ్చితత్వం, మన్నిక, ఆధునిక రూపం తమ టైల్స్ ప్రత్యేకతలు అని కంపెనీ తెలిపింది. ఈ షోరూమ్‌లో వాల్, ఫ్లోర్ టైల్స్, బాత్రూమ్, కిచెన్ డిజైన్‌లు ఉంటాయి.