- జీసీసీలతో 4.5 లక్షల ఉద్యోగాలు
- ఈ ఏడాదే వస్తాయన్న స్టడీ రిపోర్ట్
- చిన్న నగరాలకూ జీసీసీల విస్తరణ
- నేషనల్ ఫ్రేమ్‌వర్క్ వస్తుండటమే కారణం
న్యూఢిల్లీ: గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ప్రస్తుత క్యాలెండర్ సంవత్సరంలో 4.5 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని గ్లోబల్ టెక్నాలజీ, డిజిటల్ ట్యాలెంట్సొల్యూషన్స్ ప్రొవైడర్ ఎన్ఎల్బీ సర్వీసెస్ తెలిపింది. ఇది గ్రోత్ ఔట్లుక్ 2024 పేరుతో విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం.. రాబోయే ఆరేళ్లలో జీసీసీలు పది లక్షల ఉద్యోగాలు ఇవ్వగలుగుతాయి. దాదాపు 35 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను 50–100 వరకు పెంచుకోవాలని భావిస్తున్నాయి.
భారీగా నైపుణ్యం గల వాళ్లు దొరుకుతుండటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు కారణంగా ఇండియా జీసీసీలకు అడ్డాగా మారింది. అయితే జీసీసీలు రాబోయే ఆరేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉండగా, సెక్టార్లవ్యాప్తంగా కంపెనీలు 2030 నాటికి 33 లక్షల మందికి మాత్రం ఉపాధి కల్పిస్తాయని అంచనా. ఆరు పెద్ద నగరాల్లో 10 వేర్వేరు సెక్టార్ల నుంచి తీసుకున్న డేటా ఆధారంగా ఈ రిపోర్ట్ తయారు చేశామని ఎన్ఎల్బీ సర్వీసెస్ తెలిపింది. బెంగళూరు, ముంబై, పుణే, చెన్నై నగరాల్లో ఫ్రెషర్లకు భారీగా అవకాశాలు ఉంటాయి.
Also Read :- గాజాను టేకోవర్ చేస్కుంటం.. సొంతం చేస్కుని డెవలప్ చేస్తం
2030 క్యాలెండర్ సంవత్సరం నాటికి 42 శాతం జీసీసీలు 50 శాతం వరకు పెంచుకోవాలని కోరుకుంటున్నాయి. మహిళా ఉద్యోగుల సంఖ్యను 61 శాతం పెంచాలని ఇండియా కార్పొరేట్సెక్టార్లోని జీసీసీలులు భావిస్తున్నాయి. ఈ సంఖ్య ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే ఏడు శాతం ఎక్కువ. ‘‘ఇండియా గ్లోబల్ జీసీసీ హబ్గా బలపడుతూనే ఉంది. 2030 నాటికి ఇక్కడి సెంటర్ల సంఖ్య 2,100కి పెరగనుంది. మార్కెట్సైజ్ 100 బిలియన్ డాలర్లకు చేరనుంది.
టెక్, ఫైనాన్స్, మాన్యుఫాక్చరింగ్వంటి సెక్టార్లలో జీసీసీల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఫైనాన్షియల్సర్వీసెస్(79 శాతం)కు డిమాండ్చాలా ఉంది. తరువాతి స్థానాల్లో మార్కెటింగ్అండ్డిజిటల్అడ్వర్టైజింగ్(73 శాతం), ఇంజనీరింగ్ అండ్ మాన్యుఫాక్చరింగ్(69 శాతం), హ్యూమన్రిసోర్స్, ట్యాలెంట్మేనేజ్మెంట్(68 శాతం) ఉంది. కంపెనీలు తమ ఆపరేషన్స్పెద్ద ఎత్తున విస్తరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి” అని ఎన్ఎల్బీ సర్వీసెస్సీఈఓ సచిన్అలుగ్చెప్పారు. తాజా బడ్జెట్లో ప్రవేశపెట్టిన నేషనల్ ఫ్రేమ్‌వర్క్ వల్ల టైర్2,3 నగరాల్లోనూ జీసీసీలు పెరిగే అవకాశం ఉందని అన్నారు.