హైదరాబాద్, వెలుగు: గ్లోబల్ కేపెబిలిటీ సెంటర్ల (జీసీసీ) అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని కాగ్నిజెంట్ సంస్థ ఫౌండర్, మాజీ సీఈఓ ఫ్రాన్సిస్కో డిసౌజా అన్నారు. ఏఐ ఆధారిత పారిశ్రామిక ఆవిష్కరణల ద్వారా జీసీసీలు ముందుకు సాగాలన్నారు.
గాలెంట్ సీఈఓ అశ్విన్ భరత్ మాట్లాడుతూ.. పారిశ్రామిక రంగంలో ప్రపంచ సేవలు, వృత్తిపరమైన మార్పులు, అభివృద్ధి చెందుతున్న సేవా నమూనాలపై ఏఐ చూపుతున్న ప్రభావంపై నేతలకు అవగాహన కల్పించాలని అన్నారు. మరిన్ని విజయాల కోసం జీసీసీలు, సంస్థలు ఒకటిగా పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.