
న్యూఢిల్లీ: మనదేశంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీలు) జీతాలు రాబోయే 12 నెలల్లో 9.8 శాతం వరకు పెరుగుతాయని ఎన్ఎల్బీ సర్వీసెస్ రిపోర్ట్ తెలిపింది. గ్లోబల్‌గా ఉన్న మొత్తం జీసీసీల్లో 55 శాతం ఇండియాలో ఉన్నాయి. హైదరాబాద్, ముంబైలోని జీసీసీలు ఎక్కువ జీతాలు ఇస్తున్నాయి. ఐటీ సాఫ్ట్వేర్, కన్సల్టింగ్, బ్యాంకింగ్ నిపుణులకు భారీ డిమాండ్ ఉంది. 2030 నాటికి వీటి మార్కెట్ సైజు 110 బిలియన్ డాలర్లకు చేరుకుంటుంది.
వీటిలో మహిళల ఉద్యోగుల జీతాలు పురుషులతో పోలిస్తే 15 శాతం వరకు తక్కువ ఉన్నాయని, ఈ తేడాలు తొలగిపోవాలని ఎన్ఎల్బీ సీఈఓ సచిన్ అలుగ్ అన్నారు. మల్టీ నేషనల్ కంపెనీలు తక్కువ ఖర్చుతో తమ కార్యకలాపాలను నిర్వహించడానికి విదేశాలలో ఏర్పాటు చేసే ప్రత్యేక వ్యాపార యూనిట్లను జీసీసీలు అంటారు.