జీడీపీ వృద్ధి మోస్తరు గానే..

జీడీపీ వృద్ధి మోస్తరు గానే..

హైదరాబాద్​, వెలుగు : ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఏకీకరణ మార్గంలో ఉందని, ఈసారి జీడీపీ వృద్ధి  మోస్తరుగానే ఉంటుందని కేర్‌‌‌‌ఎడ్జ్ రేటింగ్స్ తెలిపింది. జీడీపీ వృద్ధి ప్రస్తుత సంవత్సరంలో 6.5శాతంగా, 2026 ఆర్థిక సంవత్సరంలో 6.7శాతం వద్ద ఆరోగ్యకరంగానే ఉంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ అనిశ్చితి ఉన్నప్పటికీ, భారత వృద్ధి స్థిరంగా కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేర్‌‌‌‌ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ రేటింగ్ ఆఫీసర్, ఈడీ సచిన్ గుప్తా మాట్లాడుతూ భారత   కార్పొరేట్ సెక్టార్‌‌‌‌లో జాగ్రత్తతో కూడిన ఆశావాదం కనిపిస్తోందని అన్నారు.

దీర్ఘకాలిక పెట్టుబడులపై వ్యాపార సంస్థలలో సంకోచం ఉంటుందని,  అయినప్పటికీ 2025లో ప్రైవేట్ పెట్టుబడుల్లో మెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నామని అన్నారు. కేర్‌‌‌‌ఎడ్జ్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్ట్ రజనీ సిన్హా మాట్లాడుతూ దీర్ఘకాల రుతుపవనాలు, బలహీనమైన పట్టణ డిమాండ్ 2025 ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో వృద్ధిని ప్రభావితం చేస్తాయని అన్నారు. వినియోగం, ప్రభుత్వ క్యాపెక్స్‌‌‌‌ పెరగడం వల్ల 2025 ఆర్థిక సంవత్సరం మలి ఆర్నెళ్లలో ఆర్థిక వృద్ధి పుంజుకోవచ్చని వివరించారు.