జీడీపీ తగ్గుదల తాత్కాలికమే : నిర్మలా సీతారామన్

జీడీపీ తగ్గుదల తాత్కాలికమే : నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ:   ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ క్వార్టర్​లో అంచనా వేసిన దానికంటే జీడీపీ తక్కువ  నమోదయిందని, ఇది తాత్కాలికమేనని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం అన్నారు. రాబోయే క్వార్టర్లలో ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరమైన వృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు.  ఈ విషయమై లోక్‌‌సభలో మంగళవారం జరిగిన చర్చకు ఆమె సమాధానమిస్తూ మనదేశం గత మూడేళ్లలో  స్థిరమైన వృద్ధిని చూసిందని, జీడీపీ వృద్ధి రేటు సగటున 8.3 శాతంగా నమోదయిందని వివరించారు.

 ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌‌ కొనసాగుతోందని నిర్మలా సీతారామన్‌‌ తెలిపారు. తయారీ రంగంలో మందగమనం లేదని, చాలా రంగాలు బలంగానే కొనసాగుతున్నాయని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ మొదటి (ఏప్రిల్–-జూన్) క్వార్టర్​లో 6.7 శాతం, జులై–-సెప్టెంబర్ కాలంలో 5.4 శాతం వృద్ధి చెందింది.