న్యూజిలాండ్ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. 2024 సెప్టెంబర్ త్రైమాసికానికి జీడీపీ 1.2 శాతానికి పడిపోయింది.న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థను, జీడీపీని ప్రభావితం చేసే 16 భారీ పరిశ్రమల్లో 11 పరిశ్రమలు తీవ్ర నష్టాల్లో కూరుకుపోవడంతో ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళింది. ప్రధానంగా నిర్మాణ రంగం, వస్తు ఉత్పత్తి తయారీ రంగం, సేవల రంగాల కంపెనీలు నష్టాల్లో కురుకుపోయినట్లు తెలుస్తోంది. వస్తువుల తయారీ కంపెనీలు అయితే.. రోజువారీ ఉత్పత్తిని సగానికి తగ్గించి... పెద్దఎత్తున ఉద్యోగులను తీసేస్తున్నాయి.
ఆర్థిక మాంద్యం కారణంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోవటంతో.. పరిశ్రమల్లో ఉత్పత్తి సామర్ధ్యాన్ని భారీగా తగ్గించాయి కంపెనీలు. వ్యవసాయం, రియల్ ఎస్టేట్ రంగాల్లో కొత్త పరిశ్రమల రాక, ఉద్యోగ నియామకాలు జరిగినా.. ఆశించిన స్థాయిలో లాభాలు లేకపోవటంతో జీడీపీపై ప్రభావం చూపింది. ఒక్క వ్యవసాయం రంగంలో మాత్రమే ఆశించిన స్థాయిలో వృద్ధి నమోదు చేశాయి ఆయా కంపెనీలు.
న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ.. ఇంతలా దిగజారుతుందని ఎవరూ ఊహించలేదు.. 2.4 శాతంగా ఉంటుందని అంచనా వేసినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూజిలాండ్ మాత్రం జీడీపీని 1.2 శాతంగా చూపించటంతో.. ఆర్థికవేత్తలు సైతం షాక్ అయ్యారు. న్యూజిలాండ్ ప్రజల తలసరి ఆదాయం తగ్గటంతో.. కొనుగోలు శక్తి క్షీణించినట్లు తెలుస్తోంది.
ALSO READ : ఇండియన్ ఇమిగ్రేషన్పై ట్రంప్ మార్క్
గత రెండు త్రైమాసికాలుగా న్యూజిలాండ్ ఆర్థిక వ్యవస్థ పతనం కొనసాగుతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.1991 మాంద్యం స్థాయిలో జీడీపీ క్షీణించిందని అంటున్నారు ఆర్థికవేత్తలు.ఫలితంగా తలసరి జీడీపీ కూడా క్షీణించి గత రెండేళ్లుగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు కొనసాగుతున్నాయని తెలిపారు.2024 3వ త్రైమాసికానికి నిర్మాణం రంగం 2.8 శాతం క్షీణించగా, విద్యుత్ 3.7 శాతం, మైనింగ్ 2.2 శాతం క్షీణించినట్లు తెలుస్తోంది.