ఆలయ చైర్మన్ పదవి ముసుగులో అవినీతి తగదు: సనాది భాస్కర్ 

ఆలయ చైర్మన్ పదవి ముసుగులో అవినీతి తగదు: సనాది భాస్కర్ 

కొమురవెల్లి, వెలుగు : మల్లికార్జున స్వామి టెంపుల్ చైర్మన్ పదవి ముసుగులో గీస భిక్షపతి అవినీతికి పాల్పడడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సనాది భాస్కర్ అన్నారు. గురువారం కొమురవెల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భిక్షపతి చేసిన అవినీతిపై గతంలోనే గంగిరేగి చెట్టు కిందకు బహిరంగ చర్చకు రమ్మని అంటే పారిపోయిండన్నారు. గుట్టపైన ఎల్లమ్మ ఆలయం వద్ద నిర్మాణం చేపడుతామని హైదరాబాద్​కు చెందిన ఓ యాదవ భక్తుని వద్ద రూ.5లక్షలు చైర్మన్ తీసుకున్నారని ఆరోపించారు. ఆలయ నిధుల నుంచి ఆలయ ధర్మకర్తలకు బట్టలు పెట్టాలని రూ. 48 వేలు తీసుకోని ఎవరికి బట్టలు ఇప్పించారో సమాధానం చెప్పాలన్నారు.

పాత బుకింగ్ కార్యలయం డిస్మెటల్ చేసిన సలాకకు సంబంధించిన రూ.20వేలు ఆలయ అకౌంట్​లో ఎందుకు జమ చేయలేదని ప్రశ్నించారు. ఔట్​సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తాననని ఎవరి వద్ద ఎన్ని డబ్బులు తీసుకున్నారో లెక్కలతో సహా నిరూపిస్తామన్నారు. ఇప్పటికైనా గంగిరేగి చెట్టు కిందకు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట రాంసాగర్ సర్పంచ్ తాడూరి రవీందర్, నాయకులు బక్కేల్లి బాలకిషన్, బద్దిపడగా కృష్ణారెడ్డి, తేలు ఇస్తారి, తాడూరి మల్లేశం, మేకల కృపాకర్, సార్ల యాదయ్య, నీల భిక్షపతి, కర్రోళ్ల ఎల్లయ్య, ఆనందం ఉన్నారు.