నాటి గ్రీస్​ కొండే.. నేటి గీసుగొండ

ఎపిగ్రాఫ్​లలో గ్రీస్​ కొండ ఫంక్తులు, పదాలు
ప్రయాణికుల కోసం వరంగల్​ దగ్గర్లో బంగ్లా

హైదరాబాద్, వెలుగుగీసుకొండ.. వరంగల్ నగరానికి సమీపంలో ఉంది. ఇప్పడు గీసుగొండ అని పిలుచుకుంటున్న ఈ ఊరు మొదట గ్రీసుకొండ అట. తెలుగు ప్రాంతాలను పరిపాలించిన శాతవాహనులకు, గ్రీస్ రాజ్యానికి మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవని చరిత్రకారులు చెబుతున్నారు. ఇటీవలి సాక్ష్యాలు కూడా దీన్ని రుజువు చేస్తున్నాయి. ‘కొత్త తెలంగాణ చరిత్ర’కు చెందిన కొందరు చరిత్రకారులు గతేడాది గీసుకొండ సమీపంలో తవ్వకాలు జరిపారు. ఇందులో ఒక పెద్ద నిర్మాణానికి సంబంధించిన పునాది గోడ బయటపడింది. ఇది 5వ శతాబ్దంలో తెలుగు భూమిని పాలించిన శాతవాహనుల కాలానికి చెందినదని పరిశోధనలో బయటపడింది. ఆ కాలంలో గ్రీస్  పాలకులు, శాతవాహనులకు మధ్య బిజినెస్​ వ్యవహారాలు జరిగినట్లు ఆధారాలు కూడా దొరికాయి. పలువురు చగ్రీస్​ కొండకు సంబంధించిన పలు రుజువులను వెల్లడించారు.

గీసుకొండలోని లక్ష్మీనరసింహస్వామి గుట్టకు వెనకవైపు చెలకల్లో దొరికిన, దొరుకుతున్న పురావస్తు ఆధారాలు, రాతియుగం సమాధులు, రాత పనిముట్లు, శాతవాహనకాలం నాటి డిజైన్ల కుండపెంకులు, టెర్రకోట మట్టిపూసలు, బౌద్ద మత సంబంధమైన టెర్రకోట బొమ్మలు, సున్నపు బొమ్మలు, స్ఫటిక బోధిసత్వుడు.. గుట్టకు తూర్పున ఉన్న ‘దీపగడ్డ’ మొదలైన అంశాలు గీసుకొండ గొప్ప చారిత్రక ప్రదేశమని చెబుతున్నాయని అంటున్నారు. ఇక్కడి దీపగడ్డ.. అమరావతి దీపాలదిన్నెను గుర్తుకుతెస్తోందని వారు విశ్లేషించారు. అయితే అక్కడి దిబ్బపై చెరువు పూడికమట్టి పోయడం వల్ల స్తూపం ఆనవాళ్ళు కప్పుకుని పోయాయి. గతంలో తవ్వకాలు జరిపినపుడు ఇటుకలు, కుండపెంకులు, ఒక కత్తి కూడా దొరికిందని చరిత్రకారులు, స్థానికులు చెబుతున్నారు. పురావస్తు శాఖ వారి నివేదికల్లో దీని గురించి వివరించారు.

గ్రీస్ నాణేలు

ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్​ఐ) 1985లో ఈ ప్రాంతంలోని తవ్వకాలను మొదలుపెట్టింది. కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే పనులు ఆపేసింది. అక్కడ దొరికిని కొన్ని బంగారు, వెండి, రాగి నాణేలపై పరిశోధనలు జరపగా.. అవి గ్రీస్ సామ్రాజ్యానికి చెందినవని తేలింది. వరంగల్ లోని ఆర్కియాలజీ మ్యూజియంలో ఈ నాణేలను ప్రదర్శనకు పెట్టారు. 1985 నుండి 2019 వరకు ఈ విషయంపై పరిశోధనలు జరగలేదు. ఇటీవలి కాలంలో కొందరు చరిత్రకారులు కలిసి కొత్త తెలంగాణ చరిత్ర వేదికను ఏర్పాటుచేసి పరిశోధనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో గీసుకొండ గురించి కొత్త విషయాలను కనుగొన్నారు. ప్రస్తుత గీసుకొండ గ్రామానికి గ్రీస్‌‌తో సంబంధాలు ఉన్నాయని చెప్పారు. దీనికి ఆధారంగా కొన్ని ఎపిగ్రాఫ్​లలో గ్రీస్​ కొండ ఫంక్తులు, పదాలు ఉన్నాయని.. ఇవి ప్రస్తుత గీసుకొండను సూచిస్తున్నాయని చెబుతున్నారు.

పెద్ద బిల్డింగ్

గీసుకొండ నుండి 5 కిలోమీటర్ల దూరంలో మట్టి పాత్రలు తయారు చేసే(పౌల్ట్రీ) భారీ భవనానికి సంబంధించిన పునాది నిర్మాణాన్ని చరిత్రకారులు గుర్తించారు. ఈ ఫౌండేషన్ 125 మీటర్ల వెడల్పు, 150 మీటర్ల పొడవు కలిగి ఉంది. గ్రీస్​ నుంచి కోటి లింగాల వచ్చే ప్రయాణికులు ఈ భవనాన్ని గెస్ట్​ హౌజ్​గా ఉపయోగించినట్లుగా తెలుస్తోందని చరిత్రకారులు చెబుతున్నారు. ‘ఆ సమయంలో శాతవాహనులు, గ్రీస్ రాజ్యాల మధ్య పెద్ద ఎత్తున వాణిజ్యం జరిగింది. ఆ సమయంలో కోటి శాతవాహన పాలన రాజధాని లింగాల. వ్యాపారులు గ్రీస్ నుండి సముద్రం ద్వారా కోటిలింగాలకు వచ్చారు. కోటిలింగాల ఒక ల్యాండ్ లాక్డ్ సిటీ, దీనికి ఓడరేవు లేదు. బంగళాఖాతంలో అప్పుడు మచిలిపట్నం, ఘంటసాల ప్రసిద్ధ ఓడరేవు నగరాలు. గ్రీస్ నుంచి వ్యాపారులు మొదట మచిలిపట్నం లేదా ఘంటసాలాకు, అక్కడి నుంచి కోటిలింగాలకు చేరుకున్నారు. వాహనాలతో వచ్చేటప్పడు వారు ప్రస్తుత గీసుకొండ ప్రాంతంలో కొంత సమయం గడిపారు. వారి కోసం ఒక ట్రావెలర్ బంగ్లాను నిర్మించారు’ అని చరిత్రకారుడు అరవింద్ ఆర్య పకిడె వివరించారు.

ఆధారాలన్నీ చెదిరిపోతున్నయ్

గీసుగొండ సమీపంలో పెదరాతియుగం సిస్తు సమాధుల నుంచి తీసి బయటపడేసిన రాతి సలపలు(ఆర్థోస్టాట్స్) కనిపించాయి. మట్టిపొరల్లో విరివిగా కుండపెంకులు, వాటిలో ఎముకలు ఉన్నాయి. టెర్రకోట మట్టిపూసలు, కొత్త రాతియుగం రాతి పనిముట్లు దొరికాయి. వ్యవసాయ భూములు కావడం వల్ల పురావస్తు ఆధారాలన్ని చెదిరిపోతున్నాయి. అక్కడ మాకు చక్రం వంటి రాతి పనిముట్టొకటి దొరికింది. దీనిని నిరూపించడానికి ఇంకా ఆధారాలు కావాలి. ఇక్కడ ఇంకా లోతైన పరిశోధన కొరకు తవ్వకాలు పూర్తిస్థాయిలో జరపాలి.

                                                                                                                                       – శ్రీరామోజు హరగోపాల్, చరిత్రకారుడు

see also: వైరస్ సోకిన ఆ ఇద్దరిని కలిసిందెవరు?

షేక్ హ్యాండ్ వద్దు .. నమస్తే ముద్దు