పెద్దపల్లి, వెలుగు: తాటి, ఈత చెట్లు పీకేసీ తమకు ఉపాధి లేకుండా చేశారని పెద్దపల్లి కలెక్టర్ ఎదుట పాలకుర్తి, రానాపూర్, కన్నాల, లక్ష్మీపూర్ గ్రామాల గీత కార్మికులు గురువారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీపీసీ సోలార్ ప్లాంట్, బూడిద చెరువు కోసం తాటి వనాన్ని జేసీబీలతో పీకేశారని ఆవేదన వ్యక్తం చేశారు. చెట్లు పీకేసే ముందు కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వలేదన్నారు.
రాత్రికి రాత్రే చెట్లు పీకేయడంతో తాము జీవనోపాధి కోల్పోయామన్నారు. కార్యక్రమంలో ఆరెళ్లి కొమురయ్య గౌడ్, బాలసాని ఈశ్వర్గౌడ్, మల్లేశం గౌడ్, రాజయ్య గౌడ్, కుమార్గౌడ్, కనకయ్య, శ్రీనివాస్, సదయ్య, తిరుపతిగౌడ్, వెంకన్న పాల్గొన్నారు