
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: పటాన్చెరు పరిధిలోని గీతం డీమ్డ్ వర్సిటీలో ఈ నెల 27న టెడ్ఎక్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు స్టూడెంట్ లైఫ్ డైరెక్టరేట్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులు పాల్గొని తమ ఆలోచనలు, అనుభవాలు పంచుకోనున్నట్లు గీతం ప్రతినిధులు తెలిపారు.
ఈ టెడ్ఎక్స్ కార్యక్రమంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి, రక్షణ శాఖ మాజీ మంత్రి పళ్లంరాజు, న్యూస్ మొబైల్ వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ చీఫ్ సౌరబ్ శుక్లా, ప్రముఖ జర్నలిస్ట్ అటికా అహ్మద్ ఫరూకీ, ప్రఖ్యాత ఆర్థికవేత్త, 13వ ఫైనాన్స్ కమిషన్అడ్వైజర్ రథిన్రాయ్, ది లెర్నింగ్ కర్వ్ సీఈవో సుబ్బూ పరమేశ్వరన్ విద్య పాల్గొంటారని వివరించారు. సినిమా, జర్నలిజం, పాలిటిక్స్, స్పోర్ట్స్, డిజిటల్ అంశాలతో ఆకర్షనీయమైన సంభాషణలు, భవిష్యత్ ఆలోచనలకు గీతం టెడ్ఎక్స్ వేదిక కానుందని, స్టూడెంట్స్కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.