పైటెక్ ఎంబెడెడ్​ సిస్టమ్స్​తో గీతం ఎంవోయూ

పైటెక్ ఎంబెడెడ్​ సిస్టమ్స్​తో గీతం ఎంవోయూ

రామచంద్రాపురం (పటాన్​చెరు), వెలుగు: విద్యా సహకారం, పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణల కోసం బెంగళూరులోని పైటెక్​ ఎంబెడెడ్​ సిస్టమ్స్​తో గీతం యూనివర్సిటీ మంగళవారం ఎంవోయూ చేసుకుంది. ఈ మేరకు పటాన్​చెరు పరిధిలోని వర్సిటీ క్యాంపస్​లో గీతం వీసీ డీఎస్​రావు, స్కూల్​ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్​ ప్రొఫెసర్​ వీఆర్​శాస్త్రి, పైటెక్​ డైరెక్టర్ అరుణ్ కుమార్, మార్కెటింగ్ చీఫ్ మురుగన్​ రంగనాథన్ ఎంవోయూ పత్రాలపై సంతకాలు చేశారు.

అనంతరం ఎంబెడెడ్​ సిస్టమ్స్​ అండ్​ ఇండస్ర్టీ 4.0 పై స్టూడెంట్ వర్క్​షాప్​ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంబెడెడ్​ ప్రతినిధులు మాట్లాడుతూ టెక్నాలజీ డెవలప్​మెంట్​ను పెంచి ఫ్యూచర్​ ఇంజినీర్లను ప్రోత్సహించడానికి గీతంతో చేసుకున్న ఒప్పందం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. విద్యార్ధులు, ప్రొఫెసర్లు, రీసెర్చ్​ స్టూడెంట్స్ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేస్తున్నట్లు వివరించారు.