
హైదరాబాద్, వెలుగు: ప్రజా సమస్యలపై ఎనలేని పోరాటం చేసిన వ్యక్తి ఈశ్వరీబాయి అని మాజీ మంత్రి, ఆమె కూతురు గీతారెడ్డి అన్నారు. ట్యాంక్ బండ్ పై త్వరలోనే ఈశ్వరీబాయి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఆమె ప్రకటించారు. ఈశ్వరీ బాయి జయంతి, వర్ధంతిని రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సందర్భంగా సర్కారుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
సోమవారం రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ,ఈశ్వరీ భాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈశ్వరీ బాయి 34వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ సైమన్ కు ఈశ్వరీ బాయి మెమోరియల్ అవార్డ్–2025ను గీతారెడ్డి అందజేశారు. అనంతరం గీతారెడ్డి మాట్లాడుతూ.. సమాజంలోని అసమానతలపై ఈశ్వరీ బాయి పోరాడిందని చెప్పారు. మహిళల కోసం ఈశ్వరీబాయి పేరుతో ఇన్ స్టిట్యూషన్స్ నడిపిస్తున్నామని పేర్కొన్నారు. ఈశ్వరీ బాయి ప్రజా సమస్యలపై ఎన్నో పోరాటాలు చేసిందని సాంస్కృతిక సారధి చైర్మన్ వెన్నెల గద్దర్ అన్నారు. తల్లి బాటలోనే గీతారెడ్డి కమాండ్ తో పని చేస్తారని, ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.