వరంగల్ రూరల్ జిల్లాలో జిలెటిన్ స్టిక్స్ పేలుళ్లు.. పలు ఇళ్లు ధ్వంసం

వరంగల్ రూరల్ జిల్లా నెక్కొండ పట్టణ కేంద్రంలో పేలుళ్లు జరిగాయి. అప్పల్ రావు పేటలోని అంబేద్కర్ కాలనీలో జిలెటిన్ స్టిక్స్ పేళాయి. చల్లా వెంకటరెడ్డి నిర్మిస్తున్న ఇంటి పునాదిలో రాళ్లను తొలగించడం కోసం జిలెటిన్ స్టిక్స్ వాడగా.. అవి రాత్రి సమయంలో ఒక్కసారిగా పేళాయి. పేలుడు ధాటికి కాలనీలోని పలు ఇళ్లు ధ్వంసం అయ్యాయి. ఇండ్ల రేకులు పగలడంతో పాటు.. ఇంట్లో సామాన్లు, టీవీలు కూడా పగిలిపోయాయని రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు అంబేద్కర్ నగర్ వాసులు. అనధికారిక పేలుళ్లు, పేలుడు పదార్థాల నిల్వలు, వినియోగం లాంటి అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.