యాదాద్రి జిల్లాలో పేలుడు పదార్థాల దందా

  • కేసులు నమోదు చేసి, జైలుకు పంపినా మార్పు శూన్యం
  • వారంలోనే రెండుచోట్ల స్వాధీనం..ఎనిమిది మంది అరెస్ట్​

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో అక్రమ పేలుడు పదార్థాల దందా యథేచ్ఛగా  సాగుతోంది. బండలను పగలగొట్టడానికి ఉపయోగించే జిలిటెన్​ స్టిక్స్, డిటోనేటర్లు యాదాద్రి జిల్లాలోని వ్యాపారులు సహా సరిహద్దు జిల్లాల నుంచి మరికొందరు జిల్లాకు రవాణా చేస్తున్నారు. పట్టుబడిన వ్యక్తులకు బదులు ఇతరులపై కేసులు నమోదు చేసిన సంఘటనలూ ఉన్నాయి. దీంతో ఈ దందాకు పాల్పడుతున్న వారికి కొందరు పోలీసుల సహకా రం ఉన్నట్టుగా అనుమానాలున్నాయి. జిలి టెన్​స్టిక్స్, డిటోనేటర్లకు సంబంధించిన లైసెన్స్ లు ఎక్కువగా బండరాళ్లు పగలగొట్టే వారు తీసుకుంటారు. అయితే వీరి పేర్లతో లైసెన్స్​లు ఇతరులు ఉపయోగించుకుంటున్నారు. లేని పక్షంలో వారితో కలిసి అక్రమార్కులు బిజినెస్​ చేస్తున్నారు. జిలేటిన్​స్టిక్స్​ ఎక్స్​ప్లోజివ్స్​వెహికల్స్​ ద్వారా రవాణా చేయాల్సి ఉంటుంది. అయితే వీటిని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఆటోల్లో తరలిస్తున్నారు. మెయిన్​రోడ్లపై కాకుండా చాటుగా గ్రామీణ ప్రాంతాల మీదుగా తరలింపు ప్రక్రి య సాగుతోంది. వీటిని ఇటీవల కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లలోనూ భారీ పేలుళ్లకు ఉపయోగిస్తున్నారు. అందుకు కూడా అనుమతి పొందాల్సి ఉన్నా పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇటీవల ఆలేరులో కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెంచర్లో భారీ బండలు పగలకొట్టేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే. జిల్లాకు చెందిన కొందరు ఇతర జిల్లాలకు చెందిన వారి వద్ద జిలిటెన్​ స్టిక్స్, డిటోనేటర్లు కొనుగోలు చేస్తూ తరలిస్తున్నారు. దీంతో యాదాద్రి జిల్లాలో వ్యాపారం చేస్తున్న  ఇతర జిల్లాల నుంచి పేలుడు పదార్థాలు వస్తున్న సమాచారం పోలీసులకు అందేలా చేస్తున్నారని తెలుస్తోంది. అయితే గతంలో పేలుడు పదార్థాలైన జిలిటెన్‌స్టిక్స్, డిటోనేటర్లను తీసుకెళ్తూ పట్టుబడిన వ్యక్తికి బదులు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చూపించిన విషయం బయటకు పొక్కింది. దీంతో సదరు పోలీసులపై డిపార్ట్ మెంట్​ పరమైన చర్యలు కూడా తీసుకున్నట్టు సమాచారం. అయితే డిపార్ట్​మెంట్​కు సంబంధించిన విషయం కావడంతో పోలీసులు గోప్యంగా వ్యవహరించారు. 

4 రోజుల్లోనే రెండోసారి...

నాలుగు రోజుల్లోనే పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకోవడం రెండోసారి. ఈనెల 3న ఆలేరు శివారు లోని వెంచర్​లో బ్లాస్టింగ్​చేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పోలీసులు దాడులు చేసి నలుగురిని అరెస్ట్​ చేశా రు. వారి నుంచి జిలిటెన్ స్టిక్స్, డిటోనేట ర్లను స్వాధీనం చేసుకున్నారు. 6న జిల్లా లోని గుండాల మండలం మరిపడగ శివారులో వందల సంఖ్యలో జిలిటెన్ స్టిక్స్, డిటోనేటర్లను స్వాధీనం చేసుకోవ డంతో పాటు నలుగురిని అరెస్ట్​ చేశా రు. వీరిని పోలీసులు జైలుకు పంపారు. గతంలోనూ కొందరిని  జైలు కు పంపి నా పరిస్థితి మాత్రం మారడంలేదు.